రాంరళీయం-ద్వితీయ పంచ ప్రసూనములు.
థామము నీది విశాల
మ్మే!మాకును చోటు గలదు మిత్రమ యందున్
కామన ఇది నాది అరసి
మోమును చూపర ముకుంద మోహన మురళీ! (6)
ఏమని కొలిచిన నిన్నే
మేమని తలిచిన దయ గొని మీటెదవో యీ
నా, మనమును చెప్పగదే?!
మోమును చూపుచు ముకుంద మోహన మురళీ! (7)
కామితము దీర్పగరావ
దేమిర? నా ఈప్సితములవి శుభకరములౌ
టేమియు వింతర?! నీ నగు
మోమును గాంచగ ముకుంద మోహన మురళీ!(8)
మోమును గనకున్నను ఆ
రామము నా కేదిరా?విరామము నీయా
రామము నందుండుగదా?!
మోమును చూపవె ముకుంద మోహన మురళీ!(9)
మోమును గనకున్నను ఆ
రామము నా కేదిరా?విరామము నీయా
రామము నందుండుగదా?!
మోమును చూపవె ముకుంద మోహన మురళీ!(10)
-
« రాంరళీయం | రాంరళీయ షడ్వేదం- తృతీయ దివస పంచ ప్రసూనములు »
రాంరళీయం-ద్వితీయ పంచ ప్రసూనములు.
@ 2009-04-17 – 12:28:47
0 Trackbacks to రాంరళీయం-ద్వితీయ పంచ ప్రసూనములు.
Related posts
-
రాంరళీయం-ఒక మనవి!
on 2009-11-22 – 15:47:55 -
రాంరళీయ షడ్వేదం!-ముక్తాయింపు
on 2009-11-22 – 14:40:20 -
రాంరళీయ షడ్వేదం: 4
on 2009-11-22 – 13:15:09 -
షిఫ్ట్ డ్యూటీ-Story-13.
on 2009-11-20 – 06:21:30 -
పొయెట్రీ ఆఫ్ లైఫ్-III
on 2009-11-17 – 10:22:34 -
పొయెట్రీ ఆఫ్ లైఫ్-II
on 2009-11-17 – 10:18:19 -
పొయిట్రీ ఆఫ్ లైఫ్-I
on 2009-11-17 – 10:10:30 -
తలవంపులు అనే సిగ్గు కథ!
on 2009-11-08 – 13:48:27 -
రాంరళీయం-సందేహాలూ-సమాధానాలు-2.
on 2009-07-29 – 12:09:06 -
రాంరళీయం! సందేహాలూ-సమాధానాలు-1.
on 2009-07-29 – 11:49:31