Search blog.co.uk

Posts archive for: January, 2009
  • రాంరళీయం-అనుబంధ వ్యాసం-1 and 2.&3

  • రాంరళీయం:-16.ఆ Fantasy

    రాంరళీయం:-16.ఆ
    (ఆకాశంలో కొంత దూరం వెళితే వాయువుండ దనీ అది శూన్య ప్రదేశ మనీ,అక్కడుండే వ్యవస్థ కాలాతీతమైన దనీ. అక్కడవుండే వస్తువులపై పీడన శక్తి లేని కారణంగా వాటికి బరువుండదనీ తెలుసుకున్నారు. అయితే space అంటే శూన్య ప్రదేశమా?! కాదు. అక్కడ విశ్వ ధూళి వుంటుంది.ప్లాస్మా వుంటుంది. అది గ్రహాల మధ్యనున్న నిర్దిష్ట దూరాలని శాసిస్తుంది. గ్రహ గతులకీ దానికీ మధ్యన అనుబంధం వుంటుంది. మన రక్తంలో ప్లాస్మా వుంది.అది మన శరీర వ్యవస్థను నడిపిస్తుంది. ఈ విశ్వంలోని సౌర కుటుంబం యావత్తూ ఆ ప్లాస్మాతో ముడి పడి వుంది.) ఈ బ్రాకెట్టులోనున్న దంత నాఊహ! నిజం కాకపోవచ్చు.
    ఇప్పుడు చివరగా మనం "దేవుడున్నాడా?",అని ఆలోచిస్తే ఉన్నాడనే చెప్పి తీరాలి. అంతర్ -బాహిర్ స్థితిలో ఆయన సర్వాతర్యామి అయి వున్నాడు. ఇదీ హైందవమే చెప్పింది.ఏకో నారాయణ అన్న వారే ఊర్థ్వంచ నారాయణ: అథశ్చ నారాయణ: అంతర్శ్చ నారాయణ: బహిశ్చ నారాయణ: దిశశ్చ నారాయణ: విదిశశ్చ నారాయణ: అన్నారు.ఇక ఈ నారాయణుడు లేని ప్రదేశం లేదు.ఏదో ఒక రూపంలో ఆయన ఉంటాడు. అదే సృష్టి.అదే ప్రకృతి.ఇది నిగూఢమైనది. ఇది తెలుసుకోవటం కష్టం.మాయని తొలగించాలి.
    ద్వాపర యుగంలోని కృష్ణావతారం ఒక సారి గుర్తు చేసుకుంటే ఈ మాయ ఏమిటొ మీకు తెలుస్తుంది. దేవకీ దేవి చెరసాలలో నుండగా కృష్ణునికి జన్మ నిస్తుంది.అక్కడ నందుని ఇంట్లో యశోద మాయా దేవికి జన్మ నిచ్చింది. కంసుని నించి కృష్ణుని కాపాడే మిషతో (కృష్ణుడు చెప్ప బట్టే) వసుదేవుడు కృష్ణుని యశోద పక్కలో పడుకో బెట్టి,అక్కడ ఉన్న మాయాదేవిని తీసుకు వచ్చి దేవకి పక్కన పడుకో బెట్టాడు. ఆ మాయాదేవి ఏడుపు విని కంసుడు ఆ పసిపాపను చంపుటకు ఆకాశంలోనికి ఆ పాపను విసిరాడు. ఆ పాప ఆకాశంలో చాలా పెద్దగా అయి భీకరంగా నవ్వి కంసునికి చెబుతుంది.-"నిన్ను చంపేవాడు పుట్టాడు. నందవ్రజంలో నందుని ఇంట పెరుగుతున్నాడు." అంటూ ఆకాశంలోనే అదృశ్యమౌతుంది. placenta విడిపోయింది. దాన్నే మాయ అంటారు.ఆ మాయలోనికి గతం అంతా పొయి పుట్టిన జీవి గతం గుర్తు చేసుకోలేక పోతుంది. ఇక దేవుడున్నాడని మనం అనుకుంటే.. మనం చేసే తప్పులు ఆయనకు తెలుస్తాయా? అనే ప్రశ్న ఉత్పన్నమౌతుంది. తప్పకుండా ఆయనకు తెలుస్తుంది. ఎందువల్ల నంటే..మానవులందరూ రూపు ఏఖా విలాసాల్లో ఒకలాగే వున్నా, వారి హస్త రేఖలు ఒక దానితో ఒకటి పోలవు.ఒకే తల్లికి పుట్టిన బిడ్డలైనా సరే! నేడు సైన్సు ఆవిష్కరించిన డీ.ఎన్.ఏ.DNA సిద్ధాంత రీత్యా మనిషి మనిషికీ DNAలో మార్పు వుంటుంది. DNA picture ని బట్టి నేడు నేరస్థులను తెలుసుకోవటం వీలౌతోంది.
    బ్రహ్మ జ్ఞానులు జీవుల్ని కుండలతో పోలుస్తారు. ఇది ఒక విధంగా తప్పు. కుండ పగుల కొడితే..కుండ లోపలా వెలుపలా ఉన్నదొకటే అనే థీరీ చెబుతారు. కుండకు జీవంలేదు. కుండలను కుమ్మరి కుమ్మరి సారె మీద తయారు చేస్తాడు-పెద్ద చిన్న ఆకారాల్లో. కుండలకి తమంతట తాము పెరుగ గల సత్తా లేదు. కుండ పెరిగి తమవంటి మరో కుండను పుట్టించ లేదు.కాని,జీవులకు పుట్టుక-వృద్ధి-క్షయాలున్నాయి.
    జీవి మరో జివిని పుట్టిస్తుంది. జీవి మరో జీవిని తిని తనలో ఇముడ్చుకుంటుంది.లయం చేసుకుంటుంది.కుండలో పుట్టినప్పుడు ఎన్ని అణువులుంటాయో అన్నే చివరి వరకూ వుంటాయి.కాని,జీవిలోని అణువులు తామంతట తాము పెరుగుట తరుగుట చేసుకోగలవు. కుండ దానంతట అది పగలదు బైటి శక్తులు అ పని చేస్తాయి. మనిషికి బయటి శక్తులే కాకుండా అంతర్గతంగా కూడా నశింపు ఉంటుంది.జీవిలో జీవం తొణికిస లాడుతుంది.కుండలో జీవం
    లేదు.జీవిలో DNA-RNA గానూ వైస్ వెరాగా మారే జీవ ప్రక్రియ వుంది. అందుకే జీవిని నేను కుండతో పోల్చకుండా బుద్బుదం నీటి బుడగతో పోల్చాను.వేదాలు మహా వృక్షానికి శాఖలు. అవి శాఖోప శఖలుగా విస్తరిల్లుతూనే వుంటాయి.వాటికి అంతం లేదు.అందువల్లే అన్ని మతాల సారం అందులో ఇమిడి వుంది.చెరకు కణుపులోని కణుపు కణుపూ తీయగా వున్నట్టు విద్య అనే ఈ శాఖ ఏ భాగంలో రుచి చూచినా తియ్యగానే వుటుంది.ఒక శాస్త్రం తెలుసుకోవటం మొదలెట్టిన దగ్గర్నుంచీ ఇంకా ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది.తరగదు. భూమి లోతులోకి వెళ్లి చూస్తే -ఇంకా చాలా తెలుసుకో లేక పోయామని పిస్తుంది. ఆకాశంలోనికి వెళ్లి చూస్తే ఇంకా చాలా తెలియాలనిపిస్తుంది. తనివి తీరదు. శాస్త్రం ఎప్పుడూ మథురంగా దైవ థ్యానం లాగే వుంటుంది.ఇదంతా పార లౌకీకంగా ఆథ్యాత్మికతతో అలోచించే వానికి. అయితే భౌతిక వాదంతోనూ-మనం లౌకికంగా బతుకుతున్నాం కాబట్టి, నీవు నీవే! నేను నేనే! వాడు వాడే!!ఒకే శాస్త్రాన్ని విభజించి చూచినట్లుగా మనం వేరు వేరు పదార్థాలమే!అయితే ఆథ్యాత్మికతతో ఆలోచిస్తే మనం అందరం ఒకటే! నాకు బాధ కలిగించేదైనా సరే ఇతరులకూ బాధ కలిగిస్తుంది అనేది నిర్వివాదాంశం. ఇక్కడ పార లౌకికంగా ఆలోచించే వానికి నీవు -నేను మిథ్య అసలు లేనే లేము అనీ,ఎవరు ఎవరిని బాధిస్తున్నారనీ చంపుతున్నారనీ అనిపిస్తుంది.ఈ అథ్యాత్మిక ధోరణి వల్లే ఎవరి వృత్తి వారు చేయ గలుగుతారు. ఇదే కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. Read this Ramraliyam (రాంరళీయం) as a Fantasy. Novel idea budded from hindu philosophy having some concern with science of human embryology or some embryology of life! At least this book makes you remember Hindu philosophy while studying embryology and other life sciences and other sciences.Thus you can make science fixed into your brain as a story. Further,you try to see God every where in your subject and keep devotion on your work! So, work is worship!!It's worth to be followed without thinking of other elements.The element what you study and do any research in it is GOD no doubt for you.
    ayipoayimdi!!

  • రాంరళీయం:-16-అ.

    రాంరళీయం:-16-అ.
    మనమందరం ఎవరి వృత్తులను వారు చేసుకునే కణ జాలాల వంటి వారము.డాక్టర్లూ-ఇంజనీర్లూ-రైతులూ వ్యాపారులూ-కార్మిక వర్గం సిపాయిలూ-ఆథ్యాత్మికోపదేశాలు చేసే వారూ- ఇలా రక రకాల వృత్తుల్లో మనముటాం. అయితే మనమందరం సమాజ ధర్మాలకు లోబడే మన జీవితాలను అంకిత భావంతో గాడుపుతాము.ఏ కొందరో ఎక్సెప్షనల్ బతుకు బతికి మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్ లా భూమికి భారంగా తయారౌతారు. అయినా వారి అవసరమూ విశ్వానికుంది. ఆ ఫ్రీ రాడికల్స్ తొలగిపోతే లోకం ఎంత బాగుంటుందో తెలియ చెప్పటానికైనా వారూ ఉండాలి.శరీరంలోని కణాలు కూడా వేటి ధర్మాన్ని అవి నిర్వర్తిస్తుంటాయి. endothelial cells,epithelial cells,serum,plasma,ciliated epithelium cells,blood cells,connective tissue cells,bone cells,nerve cells ఇత్యాదులన్నీ వాటి పనులవి చేసుకుంటూ వాటి ధర్మాలని అవి నిర్వర్తిస్తాయి.మనం నీటిలో పుట్టిన బుడగల్లా చిన్న పెద్దగా ఒకరితో ఒకరం నీటి లింకుతో కాలం గడుపుతుంటాం.కొన్ని బుడగలు పగిలి పోతాయి. మరికొన్ని పుట్టుకొస్తాయి. ఇలా జరుగుతూనే వుంటుంది. ఈ ప్రకృతిలో మనమందరం పంచ భూతాల లికుతో కాలం గడుపుతూంటాం. మనం తినే ఆహారంలోని మాంస కృత్తులూ-పిండి పదార్థాలూ కొవ్వు పదార్థాలూ అవసరాన్ని బట్టి తమలో తాము రూపులు మార్చుకున్నట్టే అవసరాన్ని బట్టి ధర్మాలనూ మార్పు చేసుకుంటూ బతికే ప్రయత్నం చేస్తాం. ఆథ్యాత్మిక ఔన్నత్యం సాధించిన వ్యక్తులకి కంటికి కనిపించని కొన్ని అపూర్వ శక్తులు వస్తాయి.కరెంటు వైరులోని ప్రవహించే విద్యుత్తు ఎలా కంటికి కనిపించదో అలాటిదే ఈ ఆథ్యాత్మిక శక్తి. అటువంటిదే శరీరం గ్రహించిన ఆహారంలోని ప్రోటీన్లూ ,కార్బొహైడ్రేట్లూ, కొవ్వులూ శరీరం అవసరాన్ని బట్టి మార్పు చెంది శక్తినందిస్తాయి.బయటా దీన్ని మనం వాయువూ-అగ్నీ-భూమీ-ఆకాశం-నిప్పూ అయిన ఈ పంచ భూతాలూ వేటికవే వేరైనా వాటిలో అవి మార్పు నొంది ఒకదాన్నుంచి మరోటి పుట్ట గలవు.శక్తిని ఇవ్వ గలవు.
    విద్యుత్తులోని శక్తి మనిషికి షాక్ కొట్టి తన ఉనికిని తెల్పుతుంది.దాన్ని మనిషి తెలివిగా దీపాలు వ్లిగించుటకూ పంకాలు తిరిగేటందుకూ వంట చేసుకుందుకూ రక రకాలగా వినియోగించుకో గలిగాడు.అలాగే అయస్కాంత శక్తి ఇనుమును ఆకర్షించుట ద్వారా మనిషి తెలుసుకున్నాడు.knowledge is God! Intelligence is God మామూలు దృక్కులకు గోచరించవు తెలివి
    తేటలు. అవి మెండుగా ఉన్న ఆడు గుర్తింపు పొందుతాడు గౌరవింప బడతాడు. ఆ శక్తులను అభివృద్ధి చేసుకుందుకే ఆథ్యాత్మిక చింతన అవసరమైంది.ఇందులో ఏకాగ్రత మెదడును కంప్యూటర్ లా పని చేయించ గలుగుట ఇత్యాదులన్నీ మెదడుకందుబాటులోనికి వస్తాయి. సూక్ష్మ గ్రాహిగా మనిషి మారతాడు.అందువల్లే వీరిని జనం దేవుళ్లుగా ఆరాథిస్తారు. వీరి దర్శనంతో వ్యథులు నయ మౌతాయంటే వారు కీలెరిగి వాత పెడతారు.
    హైందవ మత గ్రంథాలు చెప్పేదేమంటే- మనకి కనిపిస్తున్నది 5 భూతాలు.నిజానికి ఇవి అయిదు కావు.అయిదుగా కనిపించే ఒక భూతమే!ఏకో నారాయణ!!నిజానికి విద్య ఒక్కటే! దానిలో ఇన్ని భాగాలు లేవు. అందుకే విద్యాథిపతి ఒక్కరే! విద్యలు విభజన చేసుకుంటే ఎన్నో విద్యలై కూచున్నాయి.ఒక విద్యను శత,సహస్ర భాగాలుగా విభజించితే ఇన్ని విద్యలుగా మనకి కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఒకే మనిషి ఔపౌసన పట్టుట అసాధ్యం. ఎందుకంటే మనమందరం పూర్ణ మిదాలం కాము.దేవుడొక్కడే పూర్ణ మిదం. అయితే మనలో ఆ దేవుని అంశలున్నాయి. అందువల్ల మనం అందరం దేవుళ్లుగా ఆని,కొద్ది సాథన చేస్తే మనం పూర్ణ మిదం అనే దేవునిలా భాసిస్తాం. అప్పుడు నవ నిథులూ,అష్ట విద్యలూ అన్నీ మనకు కరతలా మలక మౌతాయి.

  • రాంరళీయం-15.కలియుగం:- Fantasy?!

    రాంరళీయం-15.కలియుగం:-
    కలియుగ ప్రవేశం-కల్క్యావతారం:-పిండ దశలోనున్న పిండంలోకి కలి యుగం ప్రవేశిస్తే ;ఇంక పిండం మాతృగర్భంలో వుండదు. బైటికి తన్ను కొచ్చేస్తుంది. కలి పురుషునిగా కల్కి అవతార మూర్తిగా పుడమి మీద కొచ్చేస్తాడు. అయితే ఇతను త్రిమూర్త్యవతారుడు. మహేంద్రునిలా జీవించటాని కన్నట్లు మహేంద్ర తనయుడు అర్జునునిలా భూమి మీద అవతరిస్తాడు.కాని,తొలి మాసం రోజుల్లో పిండ స్థితిలో నున్నప్పటి గతస్మృతులతో ,తాను చూచిన యుగాల తాలూకు ఆనంద పారవశ్యంతో నిద్రలో ఎక్కువగా గడుపుతూ,అతనిలోని బ్రహ్మ చిన్మయానందంగా విశ్రాంతి తీసుకుంటూ,జీవ ప్రక్రియను కొన సాగిస్తాడు.ఇటువంటి పసిపాపకు తిండి ధ్యాస తప్పించి మరోటి వుండదు. తనకు తానుగా పెరగాలి కదా మరి?! తనివి తీరా అమృత తుల్యమైన మాతృస్థన్యాన్నో,మరో పోత పాలనో సేవిస్తూ ముందుకు సాగుతాడు. అప్పటికి పసి పాప త్రిగుణాత్మకమైన దైనా ఇంకా దానిలో రాగ ద్వేషాలూ-ఈర్ష్యా అసూయల వంటివి చోటు చేసుకోవు.అయితే ఇవన్నీ కోడ్స్ రూపంలోనూ జీన్స్ రూపంలోనూ అంతర్గతంగా వుంటాయి.వీరు కుల మతాలకతీతులుగా దైవ స్వరూపులుగా భాసిస్తారు.
    పరిసరాల ప్రభావం-పరిస్థితుల ప్రభావం వంటివన్నీ ఈ బ్రహ్మలో ఈర్ష్యా అసూయలనూ రాగ ద్వేషాలనూ పుట్టిస్తాయి.భూమి మీద కొచ్చిన ఈ బిడ్డ కల్కి పురుషుడే అయినా ఇతనూ ప్రకృతికి లోబడి పరిసరాల్లొ 4 అవస్థలు -బాల్య,కౌమార-యౌవ్వన -వార్థక్య దశలను చూచినట్లుగా కృత-త్రేత-ద్వాపర- కలియుగాలను అన్నీ చూస్తాడు భూమి మీద.వీరిలోనికి బాహ్యమున నున్న విష్ణు మూర్తి ప్రవేశించి,అతనిలో నున్న విష్ణువుతో లీనమై ఇవన్నీ కలిగిస్తాడు. ఇదండీ!మన పూర్వీకులు పురాణాల ద్వరా మనకు చెప్ప దలచుకున్నది.వాటిని Fantasy గా కల్పనకు జోడిస్తే డీకోడ్ చేస్తే అర్థమైన కథ ఇది!
    అయితె,పాఠకులో ప్రశ్న వేయచ్చు.యుగాలన్నీ పిండ దశలోనున్న బ్రహ్మ అనుభవించేశాడు,బయటికి కలియుగంలో కొచ్చాడు,బయటా ఇలాటి యుగాలు లేవనుకోవాలా అని?!
    అలా ఎప్పటికీ కాదు.అవన్నీ పిండ ఆవరణలో నున్న యుగాలు. ఇప్పుడు భూమి మీద కొచ్చాక -ఈ భూమి ఒక మహా యోని.ఈ యోని విశ్వ యోనిలో వుంది.అందువల్ల బాహ్య ప్రపంచంలోని ఆవరణలోనూ ఈ యుగాలన్నీ నడుస్తాయి.అయితే,కృత,త్రేఅ,ద్వాపర యుగాలు గతించి మనం భూమి మీదకి కలియుగం ప్రథమ భాగంలో ప్రవేశించ బట్టి,మనం ఆ ప్రళయాలని చూడ లేకపోవచ్చు. కాని,నిత్య ప్రళయాన్నీ-అహం బ్రహ్మ గా వున్న ఈ స్వంత బ్రహ్మ ప్రళయాన్నీ అనుభవిస్తాం.
    ఇలా జరుగుతుందని నిర్దిష్టంగా ఎలా చెప్ప గలుగుతున్నానంటే;వేద వ్యాసుడు దేవీ భాగవతంలో మణిద్వీప వర్ణన పేర అమ్మ వారి కొలువును వర్ణించాడు.దీన్ని మనం వేద వ్యాసుడు చూచిన తార్కిక దృష్టితో మనమూ చూస్తే మన కర్థమౌతుంది. దేవీ భగవతంలో వేద వ్యాసుడు ఒక ఆవరణపై మరో ఆవరణ ,ఆ పై మరో ఆవరణగా ఎన్నో ఆవరణలను వర్ణిస్తాడు. వీటిలో అనేక రకాల జీవుల్ని గూర్చి వర్ణిస్తాడు.వారి వైవిధ్య భరితమైన జీవన సరళినీ-అమ్మ వారిని కొలిచే విధానాలనీ చెప్పాడు.అందులో సురా పానోన్మత్తులూ ఉంటారు,మత్స్య మాంసాదులు తినే వారూ వుంటారు. ఎన్నో రకాల ద్వీపాల గూర్చి వర్ణించాడు.పగడాల దీవి-రత్నాల దీవి ఇలా ఉంటాయి.ఇది చదివితే మనకి వేద వ్యాసుని తార్కిక దృష్టి మనకి తెలుస్తుంది.పిపీలికాది బ్రహ్మ పర్యంతమూ అన్నీ ఒకే మూలాధారం
    నించి పుట్టాయనీ -అన్నిటికీ బతుకు తెరువులు వైవిధ్యమైనా అత:స్సూత్రం ఒకటే ననీను.
    ఇప్పుడు మానవులతో సహా సమస్త జీవరాశీ విశ్వ యోనిలో ప్రయాణం చేసి విశ్వ యోనిలో కలిసి పోయి,విశ్వ యోనిలో మరల మరల ఉద్భవించి ,మరల మరల విశ్వ యోనిలో కలిసి పోతుంటారు.ఏ జీవి ఎప్పుడు ఎక్కడ ఎలా మనుగడ సాగించాలన్నది కూడా విశ్వ యోని నిర్ణయంపై జరుగుతుంది.కాలం, దేశం,పరిథి-నిర్ణయాలు విశ్వ యోనివే!? విశ్వం కాలాతీతంలో ప్రయాణిస్తోంది. కాల మనేది మానవుడు గుణించి లెక్క కట్టుకున్నదే! ఈ విశ్వ యోనిలోని సమస్త జీవ రాశినీ పంచ భూతాలు ఒక దాన్నొకటి కట్టి పారేస్తాయి.వేటికవే అయినా అన్నిటికీ అంత:స్సూత్రం ఒకటే!-అవే పంచ భూతాల అంత:స్సూత్రం!!మనమందరం విడిగా వున్నట్టు కనిపిస్తున్నా మన మెవరం విడిగా లేము. అంత:స్సూత్రంగా మనమందరం కలిసే వున్నాం. ఇదెలాగుంటుందంటే; ఒక జీవిలో అనేక రకాల జీవ కణాలుంటాయి. వేటి కవేగా వుంటాయి.వాటి మధ్యన అణు సంధానం అమరిక చాలా ఆశ్చర్యంగా మధ్యలో ఖాళీలతో వుంటుంది. వేటి పని అవి చేసుకుంటూ పోతాయి. air conditioned ఎయిర్ కన్డిషన్డ్ గదిలా శరీరం వుంటుంది. అవన్నీ పంచ భూతాత్మకమై ఒక దాన్నొకటి అంటి పెట్టు కునుంటాయి. ఏదో ఒక కణాన్ని విడ గొట్టి చూస్తే.. ఆ కణానికీ ఒక గోడ వుంటుంది cell wall అలాగే మనుష్యులలో శరీరానికి చర్మం వుంది. మనం ఎవరికి వారుగానే విడిగా వున్నాం.ఇటుకలు ఒకదానిపై ఒకటి పెట్టి ఇల్లు కట్టినట్టే,మన శరీరంలోని కణాలన్నీ ఒకదానితో ఒకటి సంబంధం పెట్టుకుని దేహ మనే గేహాన్ని కట్టుకున్నాయి. ఇంటిలోని ఒక ఇటిక విరిగి పోతే ,ఆ స్థానాన్ని మరో ఇటికతో భర్తీ చేసినట్లే,శరీరంలోని చనిపోయిన కణాల్ని తొలగించి,కొత్త కణాలు ఆ చోటును భర్తీ చేస్తాయి.ఒక ఇల్లు కూలిపోతే, ఆ ఇంటిని పూర్తిగా తొలగించినట్లే;శరీరి మరణిస్తే; ఆ శరీరాన్ని ఖననం-దహనం ఇత్యాది రీతుల ద్వారా నశింప చేస్తాం. అలాటి ప్రక్రియే ఇది కూడా! నిజానికి శరీరంలోని అన్ని కణాలూ కలిసి వున్నట్టు పైకి కనిపించినా ,నిజానికవేవీ కలిసి లేవు.సూక్ష్మ దర్శినితో చూస్తే కణానికీ కణానికీ మధ్యన ఉన్న స్వేద రంధ్రాలు కనిపిస్తాయి. Inter cellular plasma binding కనిపిస్తుంది.ఇలా ఎన్నో కనిపిస్తాయి.అందువల్లే; అన్ని జీవులూ ఈ విశ్వ యోనిలో ఎప్పుడూ ఉన్నాయి. వాటికి చావు పుట్టుక్లలన్నవి లేనే లేవు. ఒక రకంగానున్న పదార్థం మరో రూపం సంతరించుకుంటుంది.ఇదే హైందవ మత సిద్ధాంతం!భగవద్గీత చెప్పిందీ ఇదే! మొత్తం ఇదంతా వ్యాసుడే చెప్పాడు.
    (యింకావుంది)

  • రాంరళీయం:-14.ఇంద్ర ప్రస్థ పురం:-

    రాంరళీయం:-14.ఇంద్ర ప్రస్థ పురం:-
    ఇంక ఇంద్ర ప్రస్థ పురాన్ని విశ్వ కర్మ ఒక్క రోజులో నిర్మించటం,మయ సభ నిర్మించి ఇవ్వటం వంటి ఘట్టాలున్నాయి.ఇటువంటి ప్రక్రియలు శరీరంలో వుండే జీవ కణాలకే సాధ్యం.ఇలాటి Majic ఐంద్రజాలాలు. బాహ్యమున మనం కనులతో చూడ గలిగిన వానిలో చెద పుట్టలు-చెదలు ఒక్క రోజులో పెద్ద పుట్టలు తయారు చేస్తాయి. తేనె పట్టులు (తుట్టలు) చూస్తాం.తేనె తుట్టలూ క్షణాల్లో నిర్మింప బడిపోతాయి. మయ సభ నిర్మాణంలో ఒక గమ్మత్తుంది. ఉన్నది లేనట్టూ-లేనిది ఉన్నట్టూ భ్రమలూ భ్రాంతులూ కల్పించటం ఇందులో వుంది. అది శరీర నిర్మాణంలోనె సాధ్యం. అర కణంగా వచ్చిన వీర్య కణం(తండ్రినించొచ్చిన అర్థ భాగం) అర కణంగా వచ్చిన అండం (తల్లినించొచ్చిన అర్థ భాగం) లో విలీనమై ,తనకు తానుగా కణ విభజన చేసుకుంటూ ,ఇటుకలు పేర్చినట్లుగా కణ సముదాయాన్ని పేర్చుకుంటూ వెళ్లి,రాజ సౌధం లాంటి ఇంటిని నిర్మాణం చేసుకుని,అస్థి పంజరమనే గూటిని అయారు చేసుకుని,బాహ్య వాతావరణాని కనుగుణంగా ఉష్ణోగ్రతలను మార్చుకో గలుగుతూ ఒక Air conditioned house లా ఎన్నో ప్రక్రియలు చేయ గల శక్తి ఒక్క జీవ కణానికే సాధ్యం! అందువల్లే మనం నిశ్చింతగా వుండటానికి ఒక దేహమనే గేహాన్ని కట్టుకుని ,అందులో దేవాలయంలో "నేను" అనే పదార్ధాన్ని నిల బెట్టుకున్నాం పిండ దశలోనే!!? అయితే ఈ "నేను" గాడిలో ఇంకా ఎన్నో "నేను" గాళ్లున్నారు. వారి గృహాలు వారికీ ఉన్నాయి. అలాటి "నేను" గాళ్లే మనలోనున్న అనంత కొఆటి జీవ కణాలు. అవన్నీ కలిసి ఒక జీవిని (దేవుడందామా?) నిలబెడుతున్నామని వాటికి తెలీదు. అవన్నీ తమ మనుగడ కోసం తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాయి.
    ఈ ద్వాపరంలో కృష్ణుని అన్నగా బలరాముడు మరో విష్ణ్వావతారం వస్తుంది. ఈయన ఆయుధం హలము అంటే నాగలి. ఈ నాగలితో భూమి (జీవిని)దున్ని ,అవసర్మైన మేర నదులూ కాలువలూ,పిల్ల కాలువలూ డ్యంలూ వగైరాలు నిర్మించుకుని శరీరంలోని రక్త ప్రసరణ వ్యవస్థకు సాయం చేస్తాడు. ధమని-సిరలు అనే రెండు రక్త నాళాలలో సిరలలో రక్తం వెనక్కి పోకుండా జేబులు పౌఛ్ లు ఏర్పాటు చేశాడు. ఈ బల రాముడు తన నాగలితో పిండ శరీరంలోని furrows and ridges సవ్యం చేసి capillary Bed ద్వారా ఆయా ప్రదేశాలకు పోషక పదార్థాలను అందేలా చేసి, అక్కడ్నించి మలినాలను బయటకు పంపే drainage system వ్యవస్థను ఏర్పాటు చేస్తాడను కోవాలి.
    ఆ విధంగా పిండ రూపంలోనున్న భవిష్య బ్రహ్మకు ద్వాపర యుగం పూర్తయ్యింది. శ్రీ కృష్ణుడూ-అర్జునుడూ ఇత్యాదులందరూ పిండంలో విలీన మయ్యారు.(గుణ-నిర్గుణ-ఆత్మ-లౌకిక-పారలౌకిక -సత్య-అసత్య-భౌతిక-అభౌతిక రూపాలలో
    వీరున్నారు)కర్తవ్యాన్ని బోధించేటందుకు కృష్ణుడు -ధర్మా ధర్మాలను చెప్పేటందుకు ధర్మజుడు,పరాక్రమాన్ని చూపే అర్జునుడు-బలాన్ని ప్రదర్శించే భీముడు-అంతర్గత వైద్య విశారదులైన నకుల సహదేవులూ పిండంలో విలీన మయ్యారు.
    ద్వాపర యుగ సమాప్తితో విష్ణువు యొక్క దశావతారాల్లో తొమ్మిది అవతారాలు ఇక్కడితో పూర్తయ్యాయి.
    ఇప్పుడు పిండంలోనూ దాని తాలూకు పొరలలోనూ,allantois,chorion,omnion,placenta వీటన్నిటిలోనూ ఈ చూచిన యుగాల తలూకు చిహ్నములు కోడ్సూ-కోడాన్స్- జీన్స్-మైటొఖాండ్రియా,న్యూక్లియస్-న్యూక్లియోలస్- ఇత్యాదులన్నిటిలోనూ నిక్షిప్తమై వుంటాయి. దేని అవసరమొస్తే ఆ గుణమో-దాన్ని నడిపే మరో జీనో పుంజుకుని పని అందుకుంటుంది. దేహమంటే ఇప్పుడు- పంచ భూతాలూ-పంచ కోశాలూ (అన్న కోశము-శ్వాస కోశము-హృదయ కోశము-నాడీ మండల కోశము-విసర్జన ప్రక్రియా కోశము.) పంచ పాండవులు అయిదుగురూ- ;ద్రౌపది, కృష్ణుడూ, త్రిమూర్తులు- బ్రహ్మ -విష్ణు మహేశ్వరులూ,ఇలా అందరూ శరీరంలో చేరి వుంటారు.అరిషడ్వర్గములైన కామ క్రోధ మద మాత్సర్యములు కూడా అంతర్గతంగా షట్చక్రవర్తులుగా వుంటాయి. సప్త సముద్రాలూ సప్త లోకాలూ,అన్నీ చొటు చేసుకుంటాయి జీవిలో.
    (యింకావుంది)

  • రాంరళీయం-13.ద్వాపరయుగం:-

    రాంరళీయం-13.
    ద్వాపరయుగం:- ఈ యుగంలో విష్ణువు రెండు అవతారాలు ఎత్తాడు.1.బలరాముడు.2.శ్రీకృష్ణుడు. ఈ కొత్త రెండు అవతారాలే గాక మిగిలిన పాత అవతారాల గూర్చీ ప్రస్తావనలుంటాయి.ఆరో నెలలో పిండంలో షడ్చక్రవర్తులు ప్రవేశించినా , అరిషడ్వర్గములు -కామ క్రోధ మోహ మద మాత్సర్యములు చోటు చేసుకున్నా;ఏడవ నెల ప్రవేశంతో ద్వాపర యుగం ప్రారంభమౌతుంది. ఈ యుగం భవిష్యద్బ్రహ్మ భూమి పై అవతరించే దాకా వుంటుంది. నిజానికి పిండం ఈ దశలో సంపూర్ణమైన కృష్ణావతారమే! కృష్ణుడు బాల్యంలోనే తనను చంపుటకు వచ్చిన ఎందరినో (రాక్షసులను)చంపాడు. తనను చంప బూనిన మేనమామ కంసుడినీ,తనను అవమాన పర్చిన మేన బావ వరుస అయిన శిశుపాలుడినీ చంపాడు.ఈ దశలో పిండం తన పెరుగుదలనే ముఖ్యంగా భావిస్తుంది. తన సుఖమూ-తన గౌరవమూ-ఉనికినే చూసుకుంటుంది. మిగతా విషయాలేవీ పట్టించుకోదు.
    అందుకే తానుబతికి బట్ట కట్టేటందుకు అడ్డు పడే ఏ దుష్ట కణాన్నైనా తనకు తాను గానీ-మరో జీవ కణం ద్వారాగానీ చంపుతుంది-చంపిస్తుంది. దీనికోసం పిండంలో తయారైన ఆంటీ బాడీస్ ,ప్లాసెంటల్ ఫ్లూయిడ్స్ (Anti bodies-Placental fluids) వున్న ప్లాసెంటా లో కాళింది మడుగులో కాళింది (allontois) ని క్రిందకు అణగదొక్కుతూ తనలోని మాలిన్యాలను allentoisలోనికి గెంటి వేస్తూ చిన్మయానందంగా వుంటాడు.
    ఈ ద్వాపర యుగంలో కఠినమైన రామ శాసనానికి చాలా సడలింపులొచ్చాయి. కృష్ణుడే స్వయంగా అష్ట భార్యలతో కలిశాడు. ఇంకా ఎందరో గోపికలతో క్రీడించాడు. పదహారు వేల గోపికలు -ఇవన్నీ అస్కలిత బ్రహ్మ చారిగా వుంటూనే చేశాడు. xక్రోమోజోములన్నీ స్త్రీ కణాలే! అటువంటి క్రోమోజోములే ఎక్కువగా వుంటాయి. పుట్టబోయే పిండం మగదై xy అయినా ..xలతో కలుస్తుంది. ఆడదైనా xxలు xలతోనే కలుస్తుంది. ఏ విధంగా చూచినా x క్రోమో జోములే అంతటా వుంటాయి. అవి పుట్ట బోయే పిండంతో రమిస్తాయి.
    మహాభారతంలో ద్వాపర యుగంలో వచ్చే పాత్రలు చాలా ఎక్కువ. దీనిలో వచ్చే 18 పర్వాలలోనూ ఎక్కడో అక్కడ మళ్లీ ఉప భారతాలుంటాయి. ఈ మినీ భారతంలో కూడా సంగ్రామాలూ గట్రా వుంటాయి. దేవతల ద్వార మానవ కాంతకు పుట్టిన వారు రాక్షస స్త్రీని వివాహ మాడ్డం వుంది. (భీముడు హిడింబిని పెళ్లాడాడు.) క్లోనింగ్ పద్ధతిలో పుట్టిన వారున్నారు. కుంభ సంభవుడు ద్రోణా చార్యుడున్నాడు. గాంధారి గర్భం విచ్ఛిన్న మైతే కుండలలో పొదగ బడ్డ దుర్యోధనాదులనే నూర్వురు సోదరులున్నారు.ఒక దుశ్శల అనే సోదరి వుంది. ఇలాటి రకరకాల జీవ కణాలున్నాయి. యమ ధర్మరాజు వల్ల పుట్టిన ధర్మరాజు,ధర్మాలు చెబుతూ పిండంలో Biological clock maintain చేసి ,ఎప్పుడు స్వర్గా రోహణ చెయ్యాలో చెప్పే వాడున్నాడు. వాయు పుత్రుడు భీముడు బల శాలిగా వుంటూ తన ఆధిక్యతని చూపే వాడున్నాడు. నారాయణునే రథ సారథిని చేసుకున్న; శివుని మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందిన నరుడు ఇంద్ర పుత్రుడు అర్జునుడున్నాడు. ఇంక దేవ వైద్యులైన అశ్వినీ దేవతలకు పుట్టిన నకుల సహ దేవులున్నారు పిండానికి అవసర సమయంలో వైద్యం చెయ్యడానికి. ఇంకేం కావాలి?! పిండం బతికి బట్ట కట్టడానికి వీరందరూ చాలరా?! కురు క్షేత్ర సంగ్రామంలో పదునాలుగు అక్షౌహిణీల సైన్యం (జీవ కణాలు) నశించాయి. ఇవన్నీ ఎలెంటాయిస్ allontois లోనికి వెళ్లి పోయాయి. ఆమ్నియాన్ omnion లోనికి వెళ్లి Omniotic fluid లో కలిసి పోయాయి.వారి పంచన చేరిన వారి నందరినీ, శ్రీ కృష్ణుడు ఈ సంగ్రామంలో చంపించాడు. ఇటు పాండవ సైన్యంలోనూ ఎందరినో చంపించాడు. అసలు జీవితమంటేనే సంకుల సమరమనే పాఠాన్ని పిండానికి చెప్పాడు.ఇంక గీతోప దేశం అర్జునునిలా వున్న పిండానికి చేశాడు. అసలు చంపే దెవరు? చంపిందెవరిని?చచ్చిన దెవరు?ఆత్మకు చావు లేదు. నేనే చంపిస్తున్నాను. నేనే అన్నీ.నాలోనే అందరూ ఇమిడి పోతారు. అంటూ తన విరాట్ స్వరూపాన్ని చూపాడు. (మూల కణాలు- Stem cells) నీవు నీ కర్తవ్యాన్ని నిర్వహించడం వరకే! అందులో వచ్చే లాభ నష్టాలతో నీకు నిమిత్తం లేదు. అన్నీ నాకే అర్పించు. నీవు నా శరణాగతుడివై నేను చెప్పినట్లు నడుచుకో! నా భక్తుడెన్నటికీ నష్ట పోడు. ఇలా 18 అధ్యాయాల్లో గీతోపదేశం సాగుతుంది. ఇలాటి long lecture అసలైన యుద్ధ భూమిలో జరిగే అవకాశం లేదు. పిండ రూపికి గర్భంలోనే చెప్పే అవకాశ ముంటుంది.
    ఇంక భారతంలో ఒక ముఖ్యమైన ఘట్టం వుంది. అందులో ఖాండవ దహనం గూర్చి వుంది. అలా దహనం జరిగిన చోట గాలి కూడా వుండదు. అందువల్లే పుట్టిన జీవి శ్వాస కోశాలు శూన్యంగా వుండి వాటిలో గాలి వుండదు.శ్వాస కోశంలోని అల్వియోలై alveoli అన్నీ ముడుచుకుని వుంటాయి. బిడ్డ పుట్టగానే ఈ alvioli ఖాళీ ప్రదేశం కాబట్టి ,అందులోనికి గాలి చొర బడుతుంది. ఒక్క సారిగా ఇలా గాలి చొర బడ్డంతో బిడ్డ ఉక్కిరి బిక్కిరి అవుతాడు. ఏడుస్తాడు. ఇంక తన శ్వాస తను పీల్చుకోవడం ,తన ఆహారం తను తీసుకోవటం వంటి చర్యలు మొదలౌతాయి.
    ఇందులోనే సంతృప్తి చెందిన అగ్ని దేవుడు కృష్ణునికి సుదర్శన చక్రాన్నీ,అర్జునునికి దివ్యాస్త్రాలనీ ప్రసాదించాడు. పుట్టబోయే జీవిలో ఇలాటి అస్త్రాలన్నీ అంతర్గతంగా వుంటాయి. ఎవరికి వారు తమ మేథస్సును రాపాడితే అవి బయటకు వస్తాయి. ఆది మానవుడు బతుకు తెరువు కోసం మేథస్సును రాపాడి రాతి ఆయుధాన్ని తయారు చేసుకున్నాడు. అలాటి పనులన్నీ చేబట్టేటందుకు అస్త్ర శస్త్ర విద్యలన్నిటినీ పిండంలో ఈ ద్వాపర యుగంలో విష్ణువు-బ్రహ్మ-శివుడు కలిసి నిక్షిప్తం చేశారు.
    (యింకావుంది)

  • రాంరళీయం-12.-శ్రీ రామ పట్టాభిషేకం

    రాంరళీయం-12.
    శ్రీ రామ పట్టాభిషేకం-రాముని రాజ్యం ఎలా సాగింది?:-
    ఇది చెప్పుకునే ముందు హిందూ పురాణంలోని మరో కథని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. దేవ దానవులు కలిసి క్షీర సాగర మథనం చేసినప్పుడు హాలా హలం (కాల కూట విషం)పుట్టింది.ఆ విషాన్ని శివుడు మింగి గొంతు దగ్గర పట్టి వుంచాడు. అందుకే అతడు గరళ కంఠుడయ్యాడు. లింగా కారంలోనున్న fertile ovum గరళాన్ని తన కంఠంలో పట్టి వుంచింది. ఆ ప్రదేశంలో లొత్త ఏర్పడి పిండం నీల కంఠుడయ్యాడు. see the developing embriyo at the stage of getting constriction at neck region and further development. ఇప్పుడు పిండం ఊర్థ్వ భాగం బ్రహ్మ పదార్థమున్న మెదడున్న ప్రదేశం. కంఠ భాగం- (నీల కంఠేశ్వరుడు) శివుడు. ఇంక శివుడు పుర్రెలూ-ఎముకలూ హారాలుగ ధరిస్తాడు. శివ తత్త్వంలో పిండంలో ఎముకలు రూపు దిద్దుకుంటాయి. బ్రహ్మ పదార్థమైన మెదడుకు పైన ఈ పుర్రె తయారవుతుంది. కథలో బ్రహ్మ తాను ఊర్థ్వంగా
    పయనించి శివుని శిఖరాగ్రం చూశాననడం అందుకే అసత్యం అయింది. బ్రహ్మ చేరిన చోటును అధిగమించి శివుడు పుర్రెను తయారు చేసుకున్నాడు మరి ! అయితే శివుడు (అస్థిపంజరం)లోనికి బ్రహ్మ -విష్ణువులు మజ్జి రూపంలో ప్రవేశించారు.
    శ్రీ రామ పట్టాభి షేకం:-
    1. వసిష్ఠుడు శ్రీ రాముని సతీ సహితముగా రత్న మయమైన పీఠముపై కూర్చుండ చేసెను.(అగ్ర స్థానం)
    2.వసిష్ఠుడు,వామ దేవుడు,జాబాలి,కాశ్యపుడు,కాత్యాయనుడు,సుయజ్ఞుడు,గౌతముడు,విజయుడు ఈ ఎనమండుగురూ (8)స్రీరాముని వసువులు. సహస్రాక్షుడైన ఇంద్రుని అభిషేకించినట్లు స్వచ్ఛము-సుగంధితమునైన జలముతో అభిషేకించిరి.
    3.మొదట సర్వ ఔషథి రసముల తోడను,జలములతోడను, ఋత్విక్కుల ద్వారాను,తిరిగి కన్యల ద్వారాను,మంత్రుల ద్వారాను, యుద్ధ వీరుల ద్వారాను,ఆ తరువాత విణిజ శ్రేష్ఠుల ద్వారాను అభిషేకము చేయించిరి. వివరణ:- పిండంలోని కణాలు చనిపోకుండా వుండేటందుకు ఈ సర్వ ఔషథుల స్నానం చేయించటం జరిగింది. మాతృ గర్భంలోని రక్తం నించి ఈ ఓషథీ గుణాలున్న రసం వచ్చి పూర్తిగా పిండాన్ని తడిపింది. ఇప్పుడు తల్లిలో నున్న Antibodies & medicines పిండాన్ని కాపాడేటందుకు తోడ్పడుతాయి.
    4.అపుడు ఆకాశమున దేవతలు,నల్వురు (4)దిక్పాలురు దేవతలందరూ కలిసి అభిషేకించిరి. ఇలా పిండంలోనికి చేరిన నీరు 87% గా వుటుంది.
    5.రాముడు మిక్కిలి ఆనందంతో రాజ్యమును పాలించెను. పౌండరీక, అశ్వమేథ, వాజపేయాది యజ్ఞములనూ,ఇంకా పెక్కు విధములైన యాగములను చేసెను.
    6.నూరు అశ్వ మెథములను చేసెను. ఏకాదశ వర్ష సహస్రముల కాలము రాజ్యము చేసెను.5-6-7 మాసముల వ్యవధిలోనే ఈ ఏకాదశ వర్ష సహస్రమును సెకన్లూ- అర సెకన్లూ ఇంకా సూక్ష్మంలో ఈ లెక్క కట్టు కోవాలి.
    పిండ రూపిలో ఈ యజ్ఞాలూ-యాగాలూ అనేవి యజ్ఞ వాటికల్లో ఋషుల పర్యవెక్షణలో జరుగుతాయి. ఈ యజ్ఞాలు జరిగేవి - పిట్యూటరీ గ్లాండ్,ఎడ్రినల్ గ్లాండ్,థైమస్ గ్లాండ్,థైరాయిడ్ గ్లాండ్,సెలైవరీ గ్లాందులుగా నిర్థారించుకోవాలి. అలా చేసిన యజ్ఞ కుండంలోనించి హార్మోన్స్ విడుదలవుతాయి. ఇవన్నీ పిండానికి ఎసెన్షియల్స్-(అత్యవసరములు) అలాగే లివర్ స్ప్లీన్- పాంక్రియాస్ లు యజ్ఞ వాటికలు.
    7.శ్రీ రాముడు రాజ్యము చేయుచుండగా విధవా విలాపమనునది లేదు. అంటే.. భార్యా-భర్తగా వున్న జంట కణాల్లో భర్త ముందుగా చని పోలేదన్న మాట. సర్ప చోరాది భయములు లేవు.అంటే.. సర్పాల్ల వుండే నాడీ మండల వ్యవస్థలోని న్యూరాన్లు సవ్యగతిలో వున్నాయి. సర్పిలాకారంలో వుండే ఆర్.ఎన్.ఏ డీ.ఎన్.ఏ లు అన్నీ సవ్య రీతిని వున్నాయి. కండరాలని పట్టి వుంచవలసిన ligaments వల్ల పిండానికి హాని కలుగకుండా సవ్యంగా వుండి వృద్ధి చెందుతున్నాయన్న మాట.చోర భయం లేదు. అంటే.. ఓ కండరం మరో కండరం పై overlap అవటం లేదు. ఒక కణం అస్థిత్వానికి గురి కావట ల్లేదన్న మాట.ఏ కణం arena పరిథిలో ఆ కణం వుండి చక్కగా తమ విద్యుక్త విథులను జరుపుతున్నాయన్న మాట.
    8.ఎవ్వరునూ అనర్థ మాచరించ లేదు.వృద్ధులు బాలుర ప్రేత కార్యములు చేయ లేద్దు. పిండం లోని జీవ కణా లేవీ పిండాన్ని చంపే అప్రాచ్యపు పనులు చెయ్య లేదు. కొత్తగా పుట్టే కణం పాత బడి పోయిన వృద్ధ కణం కన్నా
    ముందు చావట ల్లేదు.
    ఇక్కడ రామాయణంలోని ఒక ఉప కథ చెప్పు కోవాలి. ఒక బ్రాహ్మణుడు తాను బ్రతికుండగా తన కొడుకు చని పోయాడని చెప్పి రాముని దగ్గర కెళ్లి మొర పెట్టుకున్నాడు. దానికి కారణ మేమంటే .. ఒక శూద్ర ముని (శంభుకుడు) చెట్టెక్కి దాని పై కండ్లు మూసుకుని మౌనంగా తపస్సు చేస్తున్నాడని చెబుతాడు. రాముడు వెళ్లి ఆ శూద్ర ముని శంభుకుని చంపాడు.అప్పుడు చని పోయిన ఆ బాలుడు తండ్రి బతికుండగా చని పోయిన జీవ కణంలోకి ప్రాణం వచ్చింది.శరీరంలో ఏ మూల ఏమి జరిగినా దాని పర్య్వసానం మొత్తం శరీరం మీద వుంటుంది. ఏ కణం చెయ్య వలసిన పని ఆ కణం చెయ్యాలి.
    దీనిని బట్టి కుల విభజన ,కుల వ్యవస్థను పాటించి తీరాలనే శాసనాన్ని రాముడు అమలు పరిచాడన్న మాట! రామాయణంలో సుగ్రీవాజ్ఞ అంటే ఏమిటో కోతులకు తీలిసినట్లు, పిండం లోని అన్ని కణాలకూ రామ శాసనం అంటే ఏమిటో తెలిసి పోయింది.బ్రాహ్మణ-క్షత్రియ-వైశ్య-శూద్ర జాతులకు చెందిన జీవ కణాలు లోభ వర్జితులై,ఉత్తమ లక్షణాలు కలిగి,ధర్మ పరాయణులుగా వుంటూ తమ తమ విహిత కర్మలను చేశాయి.
    అంటే.. salivary gland లాలా జల గ్రంధి వెళ్లి ముక్కులో కూచుంటాననీ, olfactory system వచ్చి నోట్లో కూచుంటామని గానీ పేచీలు పెట్ట లేదు. Ciliated epithelium,Endothelium,skin tissue ,muscle tissue ఏవి ఎక్కడుండాలో అక్కడే వుంటూ తమ పనులను నిర్వర్తిస్తున్నాయన్న మాట! ఇదే నిజమైన కుల వ్యవస్థ. అది పిండ రూపంలోని జీవ కణాలకు వుంది. విష్ణువు ఆదేశం ప్రకారం తమకు నిర్ణయించిన పనులను తాము చేసుకుంటూ పోవాలి. అలా చేసినప్పుడే భవిష్యద్బ్రహ్మ పుడమి మీద సవ్యంగా పుడతాడు లేక అవతరిస్తాడు.
    పిండ దశలో ఏడు నెలలు పూర్తి చేసుకునేసరికి త్రేతాయుగం అంత మయ్యింది. రాముడు సరయూ నది జలాల్లో కలిసి పోయాడు. ఇది ఉప్పు నీటిలో కరిగినట్లు. Ph7% గా సెలైన్ ఫ్లుయిడ్ బ్లడ్ లో వుంటుంది. ఇక సీతమ్మ వారు భూమిలో కలిసి పోయారు. అంటే పిండం మొత్తంలో అన్ని జీవ కణాల్లో వుండే x 'ఎక్శ్ క్రోమోజోమ్ లలో విలీన మయ్యాన్న మాట! ఇక్కడితో దశావతారాల్లో ఏడు అవతారాలు పూర్తయ్యాయి. అలాగే త్రేతాయుగం పూర్తయ్యింది.
    (యింకా వుంది)

  • రాంరళీయం-11.ప్రళయాలు ఒకటి కాకుండా ఎన్నో ఉన్నాయి:-

    రాంరళీయం-11.
    ప్రళయాలు ఒకటి కాకుండా ఎన్నో ఉన్నాయి:- ఈ ప్రళయాలని విడ దీస్తే 1.నిత్య ప్రళయం,-ఇది మనిషి అనే బ్రహ్మకు సంబంధించినది. 2.నైమిత్తిక ప్రళయం-ఒక్కొక్క మనువు గతించడంతో ముగిసే ప్రళయమిది.3.పరబ్రహ్మకు ఒక పగలు తరవాత వచ్చే ప్రళయమిది.దీనే బ్రహ్మ లెక్కలో ఆయన దైనందిన ప్రళయం. అన్నారు.4. బ్రహ్మ ప్రళయం-నూరు సంవత్సరాలు పూర్తి చేసుకుని నశించే కార్య బ్రహ్మ ప్రళయమది.
    ఇక ప్రతి సంవత్సరం వచ్చే గాలివానలూ, భూ కంపాలూ,వరదలూ,అగ్ని పర్వత పేలుళ్లూ వంటివి చిన్న్ చిన్న ప్రళయాలై కొంత జీవ రాశిని నశింప చేసి మిగిలిన జీవ రాశిని బతక నిస్తుంది. ఇందులో మరణించిన జీవ రాశి వేటికవే బ్రహ్మ రూపాలు కాబట్టి ఆ యా బ్రహ్మలు నశించే ప్రళయమనుకోవాలి దీన్ని.
    మనిషి అనే బ్రహ్మలోని కృతయుగం:- అండం పిండంగా మారిన దగ్గర
    నించీ ఇది మొదలౌతుంది. Fertile Ovum నించి అన్న మాట.మనిషిలో fertile ovum పూర్తి రూపం దాల్చి భూమి పై అవతరించటానికి పట్టే కాలం 9 న్లల 9రోజులు. దీన్ని gestation period అంటారు. అందువల్ల పిండ దశ లోని మొదటి నాలుగు నెలల కాలం కృత యుగ మౌతుంది. ఆ తరవాతి మూడు నెలలూ త్రేతా యుగ మౌతుంది. మిగిలిన రెండు నెలల పై చిలుకు రోజులన్నీ ద్వాపర యుగమౌతుంది. ఇదంతా పూర్తి చేసుకున్న పిండం భూమి మీదకి కలియుగంలోకి కల్కావతారిగా రెండే చేతులు,రెండే కాళ్లు,ఒక కత్తి (ఇది వ్న్నుపూస!వెన్నెముక -దధీచి వెన్నెముక వజ్రాయుధంగా ఇంద్రుడి చేతులో వుంటుంది.);తో అవతరిస్తాడు. కృత యుగంలో పిండ దశలోనున్న ప్రాణి కొరకై విష్ణువు మత్స్య-కూర్మ-వరాహ నారసిమ్హ-వామన-పరశురామావతారాలు ఎత్తాడు. ఆ విధంగా ఆరు అవతారాలు పూర్తయ్యాయి.
    భూమి మీద పుట్టే ప్రతి బ్రహ్మ వంటి జీవికీ Gestation period లో వ్యత్యాసాలున్నాయి కావున ఆ యా వ్యత్యాసాలను బట్టి ఆ యా జీవుల కృత-త్రేత-ద్వాపర యుగాల పిండ దశలను లెక్క కట్టుకోవాలి.
    ఇంక పిండ దశలోనున్న జీవిలో త్రేతాయుగం ప్రారంభ మవుతుంది:- త్రేతా యుగంలోని జీవులకు భూమి వాస యోగ్యంగా లేదు.భూమిపై ఎందరో రాక్షసులూ అనేక రకాల గొడవలూ ఉన్నాయి. అలాగే పిండ దశలోనున్న పిండం లోని జీవికి పిండం వాస యోగ్యంగా లేదు (ఒక్కో కణం ఒక్కో జీవిగా ఉంటే వాటికి పిండంలో పరిస్థితి వాస యోగ్యం గా లేదు)అందుకోసం శ్రీరాముడు అవతరించి పిండాన్ని జీవికి వాస యోగ్యం చేస్తాడన్న మాట. ఈ ప్రక్రియ 5-6-7-మాసాల్లో పిండంలో పూర్తవుతుంది.
    శ్రీ రామావతారం:- ఈయన ఏక పత్నీ వ్రతుడు. సత్య సధుడు.న్యాయాన్యాయ విచక్షణా శీలి. ధర్మా ధర్మాలు తెలిసిన వాడు. ఆయన వావి వరసలు లేకుండా సంభోగించే వారిని శిక్షించాడు. ఈయన పిండంలోని ఉత్తర దిక్కునుండి దక్షిణ దిక్కుకు మొత్తం ప్రయాణించి లంకలో కూడా అడుగు పెట్టాడు. రావణునితో సహా ఎందరో రాక్షసులని సమ్హరించాడు. పట్టాభిషిక్తుడై పిండంలోని కణాల కన్నిటికీ అధిపతై రాజ్యం చేశాడు. పిండంలోని ఒక్కో ప్రదేశానికీ ఒక్కొక్కరిని రాజుని చేసి పట్టాభిషేకం చేశాడు. అలా పట్టాభిషిక్తులైన వారు విభీషణుడు,సుగ్రీవుడు,భరతుడు,శత్రుఘ్నుడు.
    శ్రీ రామ పట్టాభిషేక ఘట్టంలో ఈయన రాజ్యం ఎలా సాగిందో వాల్మీకి కవి వర్ణించిన దాన్ని బట్టి, మనం చాలా విషయాలను ఖచ్చితంగా అంచనా వెయ్యగలుగుతాం.
    శ్రీరాముడు పితృ వాక్యపరిపాలనా దురంధరుడు. రామునిది- విష్ణు అంశ అయిన పిండంలోనున్న రాముని తండ్రి దశరథ బ్రహ్మ. దశరథ బ్రహ్మ కాలం మొదలయ్యే నాటికి పురుషులు ఇద్దరూ-ముగ్గురూ ఇలా ఇకెందరెందరో భార్యలనీ.ఉంపుడు కత్తెలనీ ఉంచుకుంటున్నారు. అంటే.. పిండంలోని ప్రతి జీవ కణం ఇటువంటి వ్యవస్థలో వుంది. దశరథుడు రాజ్యం చేస్తున్నాడనే సరికే పిండంలో దశేంద్రియాలూ పూర్తిగా తయారయి వున్నాయి. దశరథ బ్రహ్మ చేత వసిష్ఠుడు మరో ఋషి చేత పుత్ర కామేష్ఠి యాగం చేయించాడు. యాగ ఫలితంగా పాయసం పుట్టింది. ఆ పాయసాన్ని నిష్పత్తుల్లో విడ గొట్టి కౌసల్యా,సుమిత్రా,కైకేయీ అనే భార్యలకి పంచి తాగించాడు. కౌసల్యకు రాముడు,సుమిత్రకు లక్ష్మణుడు, కైకేయికి భరత-శత్రుఘ్నులు పుట్టారు. దశరథునికి అందరికన్నా రామునిపై ప్రేమ మెండు. ఈ నలుగురు అన్న దమ్ములూ సయోధ్యగా వున్నారు. అన్న రాముని మాటను గౌరవించి ఆయన అదుపాజ్ఞలలో
    తమ్ములందరూ వున్నారు. అన్నను కంటికి రెప్పలా చూసుకుంటారు.అటువంటి సమయంలో విశ్వామిత్రుడు వచ్చి తాను చేస్తున్న యజ్ఞాన్ని కాపాడేటందుకని రామలక్ష్మణులిద్దరినీ తనతో అడివికి తీసికెళ్లాడు. దోవలో రామలక్ష్మణులకి అతిబల-మహాబల మంత్రోపదేశాలు చేశాడు. ఈ ప్రయాణంలో రాముడు తాటకిని చంపటం, మారీచ-సుబాహుల్ని చితక్కొట్టడం ,అహల్యకి శాప విమోచనం కలిగించటం వంటివి చేశాడు. ఆ తరవాత తన బల పరాక్రమాన్ని ప్రదర్శించి విదేహ రాజ పుత్రి అయిన (ఇతర దేహం నించి పుట్టిన) (She was not born through inter course of janaka maharaj through his wife.said to have been found in the ground as daughter of ground.With several meanings it was written. while tilting land she was found in a box.) సీతని పెళ్లాడాడు. ఇక్కడోవిషయం గమనించాలి. ఈ నలుగురు అన్నదమ్ములకీ ఏక కాలంలోనే వివాహాలు జరిగాయి. వివాహాలయ్యాక ఆ నలుగురు అన్నదమ్ములూ సతీ సమేతంగా పిండ దశలోనున్న జీవిలోని జీవ కణాల్లో తమతమ పనులను నిర్వహించారన్న మాట.
    ఇంక కైకేయి రామునికి పట్టాభి షేకం కాకుండా అడ్డుకుని రాముడిని 14 సంవత్సరాలు అరణ్య వాసం అంటే .. పిండం లెక్కలో 14 ఏళ్లు అయి వుంటుంది. కాని,మన లెక్కలో ఇవి ఏ 14 రోజులో అయి వుంటుంది. అరణ్య వాసంలో రాముడు మున్యాశ్రమాలన్నీ సందర్శించాడు. వాళ్ల దీవెనలు పొందాడు. వారి దగ్గర నేర్వ వలసిన విద్యలు నేర్చాడు. ఈ ప్రయాణంలో రాముడు ఎందరో రాక్షసుల్ని చంపి,మున్యాశ్రమములను పరి రక్షిస్తూ .. సాధు వర్తనులను సుఖ శాంతులతో ఉండేలా చూశాడు. (సీతా-రామ -లక్ష్మణులు ముగ్గురే అరణ్య వాసం చేశారు.అంటే -Trinity ఇక భరతుడిని రాజ్యం చూచుకోమనీ-అలాగే శత్రుఘ్నుని తమతో తీసికెళ్ల లేదు. వీరు బయటనించిపెరుగుదలని కాపాడారు. Omnion-allantoin లలో వీరుండి పోయారు అన్న మాట.ఇంక అరణ్య వాసం ఒక్క ఏడాది (అంటే పిండం లెక్కలో ఏ ఒక్క రోజో) ముగుస్తుందనగా,రావణుడొచ్చి సీతను ఎత్తుకుని పోయాడన్న మాట. సీతాన్వేషణలో పడి లంకా నగరాన్ని చూసి వచ్చిన రాముడు పట్టాభిషిక్తుడై,మొత్తం పిండంలోని ప్రతి భాగాన్నీ సందర్శించినట్లు విదితమౌతుంది. రావణున్ని చంపుటకు అగస్త్య మహర్షి వద్ద రాముడు ఆదిత్య హృదయాన్ని తెలుసుకుని పఠించాడు.
    లంకలో రావణుని చంపాక పుష్పక విమాన మెక్కి ఇష్టులందరినీ తనతో తీసుకుని అయోధ్యకు వచ్చాడు. అక్కడ రామ పట్టాభిషేకం జరిగింది.
    (యింకా వుంది)

  • రాంరళీయం-10పరశురామావతారం:-

    రాంరళీయం-10
    పరశురామావతారం:-పిండం ఒక దశకి చేరుకోగానే దానిలో నుండే కణాల్లో రాజస గుణం పెచ్చు మీరుతుంది.వేటికవే తమను రాజులుగా ప్రకటించుకుంటాయి.ఇవి దాన ధర్మాలు విడనాడి వేటికవే స్వార్థ బుద్ధితో సాధువర్తనులైన తమ పనిని తా నిర్వర్తించుకునే సాధు పుంగవుల్లాటి కణాలను చంపి తన అధీనంలోకి తీసికెళ్లి వాటిపై పెత్తనం చలాయిస్తూ,వాటి అభివృద్ధిని ఆపేస్తున్నాయి. శరీరానికి అన్ని రకాల కణాలూ అవసరమేగా?ఏ కణం ఎక్కడుండాలో అన్ని ముందే నిర్ణయిం పడతాయి.అటువంటిది అన్నీ నేను మెడడు కణంగానో లివర్ కణంగానో ఉంటామని కొట్టుకోవటం కూడదు. అందుకే విషయం గ్రహించిన విష్ణు మూర్తి వెంటనే పరశురామ అవతారం ఎత్తాడు. రాజస గుణంతో దుర్మార్గులు చేస్తున్న కణాలనన్నిటినీ చంపాడు. ఒక సారి కాదు రెండు సార్లు కాదు.21 సార్లు మొత్తం పిండాన్ని చుట్టి ఇలా రాజు అన్న ప్రతి కణాన్నీ చంపాడు. ఈ పరశురాముడు చిరంజీవి. అవసరాన్ని బట్టి మనిషిలో ఈ రాజస మొనో పలీ గుణం పెరిగితే మళ్లీ వచ్చి,రాజస గుణాన్ని సమ్హరిస్తాడు.అధికార మదంలోనున్న వారిని అణిచి గర్వ భంగం చేసి,అవమానాల పాలు చేసే వాడీ పరశురాముడే!పరశురాముడు చంపిన కణాలన్నీ ఒక మడుగు అయింది.
    సగర పుత్రులు -సాగరాన్ని తవ్వుట:-
    ఇంక సగర పుత్రులు సాగరాన్ని తవ్వారు. సాగరంలోనే వారు మడిశారు. సగర పుత్రులన బడే కణాలన్నీ కలిసి గుండెకాయను తయారు చేశారు. గుండె కాయ యే జీవునిలో వుండే సముద్రం.అందులోని గోదల్లో ఇరుక్కుని సగర పుత్రులు మరణించారు. రక్తం ఈ గుండెలోకి చేరింది.
    భగీరథుడు-గంగావతరణం:-
    భగీరథుడు సగర పుత్రులకి మోక్షాన్ని ప్రసాదించాలని కోరి, శ్రీ మహా విష్ణువును ప్రార్థించి గంగను ప్రసాదించ మన్నాడు.వేగంగా ప్రవహించే గంగను మోయ గలిగే సమర్థుడిని చూసుకోమన్నాడు విష్ణువు. అప్పుడు భగీరథుడు శివుడిని ప్రార్థించాడు.శివుడు గంగను శిరస్సున దాల్చుటకంగీకరించాడు.విష్ణు పాదం నించి గంగ శివుడి నెత్తి మీదకు చేరి అక్కడినించి భగీరథుని వెనకాల ప్రయాణించి పిండ శరీరమంతా పాకి,గుండెలోనున్న సగర పుత్రులనీ పునీతం చేసింది. ఇదే శరీరంలో (పిండంలో)తయారైన లింఫాటిక్ వ్యాస్థ.Lymphatic System.Lymph nodes. గంగను ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట అడ్డుకుంటూ వచ్చారు.అక్కడ లింఫ్ నోడ్స్ ఏర్పాటయ్యాయి. ఇక్కడితో పిండ దశలోనున్న బ్రహ్మకు కృతయుగం పూర్తయినట్టే!
    మనిషిని ఒక బ్రహ్మ స్వరూపంగా భావిస్తే; మనలోని రక్తంలోనున్న ఎర్ర కణ ఆయు: ప్రమాణం 120 రోజులు.ఇప్పుడు ఎర్ర రక్త కణానికి మనం పర బ్రహ్మలమన్నమాట! ఈ ఎర్ర రక్త కణానికి మరో బ్రహ్మ వుంటాడు.ఆ బ్రహ్మ
    పైన మరో బ్రహ్మ ఆ పైన మనం పర బ్రహ్మగావున్నాం.ఇప్పుడు ఎర్ర రక్త కణమే కనుక మన ఆయు: ప్రమాణంతో తన ఆయు: ప్రమాణాన్ని లెక్కలు కట్టుకుంటూ పోతే గంటల్లోనో ఘడియల్లోనో ,విఘడియల్లోనో కృత,త్రేతా,ద్వాపర,కలియుగ నిష్పత్తుల్లో వుంటుంది. మనం బ్రహ్మ స్వరూపులమైనా మన బాహ్యాన్ని మనల్ని చుడుతూ మరో బ్రహ్మ వుంటాడు. ఆ ఆవరణాన్ని చుట్టి మరో బ్రహ్మ వుంటాడు.ఆ విధంగా ఎన్ని ఆవరణలుంటాయో మనకి తెలీదు. అయితే వీటన్నిటినీ చుట్టి పర బ్రహ్మ వుంటాడు. ప్రతి ఏడూ మారే యుగ బ్రహ్మలుంటారు.(యుగాది-ఉగాది!) మన పూర్వీకులు పర బ్రహ్మ (ఎన్నో ఆవరణ బ్రహ్మో తెలీదు)అతడి ఆయు: ప్రమాణాన్ని లెక్కించి కృత,త్రేత,ద్వాపర కలియుగాల్ని నిర్థారించారు. ఆయు: ప్రమాణ నిష్పత్తులు సంవత్సరాలూ రోజుల్లో వుంటాయి. అలాగే భూమి మీదున్న సమస్త జీవ రాశీ దేనికదే బ్రహ్మ స్వరూపం. ఏఏ జీవికి ఎంత ఆయు:ప్రమాణమో దాని లెక్కల నిష్పత్తిలోనే వాటిలోనున్న కణాల ఆయు: ప్రమాణముంటుంది. ఆ విధంగా మన సౌర మండలానికి సంబంధించిన పరబ్రహ్మకు కృతయుగం 17,28,000 సంవత్సరాలు,త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు,ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు. క్స్లియుగం 4,32,000 సంవత్సరాలు.ఇలాటి 14 మన్వంతరాలు ఒక కల్పం. రెండు కల్పాలు కలిస్తే బ్రహ్మకు ఒక రాత్రీ ఒక పగలు. పగటి పూటే బ్రహ్మ సృష్టి చేసి రాత్రి నిద్రిస్తాడు.అతను నిద్రలోనికి వెళ్లినప్పుడూ ప్రళయం సంభవించి సృష్టి అంతా నశించి ఒక కల్ప కాలం స్తబ్దుగా వుంటుంది.అందువల్ల 14 మన్వంతరాల్లోనూ 7 మన్వంతరాలు సృష్టి వుండి 7 మన్వంతరాలు స్తబ్దుగా వుంటుంది. అంటే అవి 7 ప్రళయాలు. ఇప్పుడు పర బ్రహ్మ ఆయు:ప్రమాణం 100 సంవత్సరములు.14 సంవత్సరాలు బ్రహ్మకు ఒక రోజైతే అతని 360 రోజుల సంవత్సరంలో 150 ప్రళయాలూ 150 సృష్టులూ జరుగుతాయి. ఆ విధంగా ఆ పరబ్రహ్మ నూరు సంవత్సరాల్లో 15000 ప్రళయాలూ 15000 సృష్టులూ చేస్తాడన్న మాట! ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే అంటున్నాం కాబట్టి ఇది వైవస్వత మన్వంతరమని తెలుస్తోంది.కలియుగ ఆయు: ప్రమాణం లెక్కలోకి తీసుకుని ,వైవస్వత మన్వాంతరం తరువాత ప్రళయం వస్తుందన్న మాట.లేదూ దాని తర్వాతి మన్వంతరం తర్వాత ఒక కల్పం పూర్తయి ప్రళయం వస్తుంది.ఇలా కలియుగం లోని బ్రహ్మ కూడాఎన్నో ప్రళయాల్నీ స్తబ్దునీ - సృష్టినీ చూస్తాడు.ఇది పూర్తయ్యాక మహా ప్రళయం సంభవించి బ్రహ్మ పదార్థం మాత్రమే వుంటుందంటారు.అయితే ఇప్పటిదాకా చ్ప్పుకున్న అందరు బ్రహ్మలకీ తోడుగా విష్ణువూ శివుడూ వుంటారు. విష్ణువు ప్రేరణ వల్లే సృష్టి జరుగుతుంది మరి!
    (యింకా వుంది)

  • రాంరళీయం-9ఇంక వామనావతారం-త్రివిక్రమావతారం:-

    రాంరళీయం-9
    ఇంక వామనావతారం-త్రివిక్రమావతారం:-
    పిండంలో పెరుగుతున్న కణాలు తన్ను మాలిన ధర్మంగా ఒక దానితో ఒకటి పోటీ పడి దానాలు చేసుకుంటూ పోతున్నాయి. ఇక్కడ నిస్వార్థం -త్యాగం పనికి రావు.అలా జరిగితే ఏ కణాని కాకణం నీరసించి కృశించి తమ స్థానాని కోల్పోయి నశిస్తాయి. Sacrifice are not allowed for the growth.Essential selfish nature must be present అందువల్ల ఒక పక్క బ్రహ్మ సృష్టి చేస్తూపోతుంటే ,ఈ కణాలు దాన ధర్మాలని తమ ఉనికిని పోగొట్టుకోటం ఏమి సబబు?ఈ దానాల వల్ల పిండంలో ఏమీ మిగలదు.అందుకోసం ఈ కణాల్లొ స్వార్థం బలీయంగా నాటుకోవాలి. తమ మనుగడ కోసం అవసరమైతే పక్క కణాలని చంపాలి. తమకు కావలసిన్ ఆహారాన్ని సముపార్జించుటూ పెరగాలి. steel-beg-or borrow policy నేను నాది అనే అహాన్ని పెంచుకోవాలి. ఇలా చేయ వలసిన దశలో బలి చక్రవరి రాక్షసుడు పిండంలోనున్న కణాల్న్నిటి పైనా పెత్తనం చెలాయిస్తూ తనలోని దాన గుణాన్ని మిగిలిన అన్ని కణాలకూ చాటి చెపుతూ అన్నిటినీ దానాలివ్వ మంటున్నాడు. జరగ బోయే నష్టాన్ని శ్రీ మహా విష్ణువు గ్రహించాడు.అందుకే వామనావతారం ఎత్తాడు. బలిని మూడు అడుగుల ప్రదేశాన్ని దాన మడిగాడు. బలి ముందు వెనుకలు చూడకుండా మూడడుగుల జాగాని దానమిచ్చేశాడు.
    ఇంక చూసుకోండి! వామనుడల్లా త్రివిక్రముడై కూచున్నాడు. ఒక పాదాన్ని ఆకాశ మార్గాన్ని పట్టించి బ్రహ్మను (మెదడును)తాకాడు.మరో పాదంతో భూమినంతట్నీ ఆక్రమిచాడు.అంటే పిండంలోని ప్రతి కణాన్నీ ఆక్రమించాడు.ఇవే రక్త నాళాలూ కేపిలరీ బెడ్స్ గా పిండాన్ని ఆవరించేశాయి. " ఇప్పుడు మూడో పాదాన్ని ఎక్కడ పెట్టేదిరా ?'అని, బలినడిగాడు. తప్పని సరై బలి తన తలని చూపాడు. విష్ణువు తన పాదాన్ని బలి తలపై వుంచి అథ: పాతాళానికి తొక్కేశాడు.ఆ బలి చక్రవర్తికి రాజ్య భ్రష్టుత్వం కలిగింది. అయినా అతని పై జాలి తల్చి ఏడాదికోసారిసారి భూమి మీదకొచ్చి దానాలు చేసుకోమన్నాడు. అందు వల్ల సంక్రమణ పుణ్య కాలంలో జనులు (హిందువులు)దానాలు యిస్తారు.ఇప్పుడు జీవ కణాల్లో అప్పటి దాకా వున్న దాన గుణాన్ని అణిచి పిండం అభివృద్ధికి తోడ్పడ్డాదు.కరువు కాటకాలొచ్చినప్పుడూ అత్యవసర సమయాల్లోనూ సమాజం బాగు కోరి దానం చెయ్యటం తప్పని సరి. అందుకే అత్యవసర పరిస్థితుల్లో ఈ బలి బయటకు వచ్చి మనుషుల చేత దానాలు చేయిస్తాడు.పిండంలోని ఫ్ల్యూయిడ్ ని టెస్ట్ చేసేందుకు
    చిన్న సూదితో గుచ్చితే ..వెంటనే ఆ కన్నాన్ని పూడ్చేటందుకు మిగిలిన కణాలన్నీ సర్వ సన్నద్ధమౌతాయి.అప్పుడు తమను తాము త్యాగం చేసుకోవడం,దానం చేసుకోవడం (self sacrifice) చేసి మిగతా కణాలు నిలబడేలా చేస్తాయి.ఆ మిగిలిన కణాలు రంధ్రాన్ని పూడ్చి గతించిన కణాల స్థానాన్ని భర్తీ చస్తాయి.
    శ్రీమహా విష్ణువు కాలు బ్రహ్మని (మెదడు)తాకేసరికి బ్రహ్మ ఆ పాదాన్ని కడిగాడు. అలా విష్ణు పాదం కడిగిన నీరు కిందకు వెన్నెముక ద్వారా దిగి spinal cordలోకి వచ్చి cerebro spinal fluid అయింది.
    (యింకా వుంది)

Footer:

The content of this website belongs to a private person, blog.co.uk is not responsible for the content of this website.