భవిష్య బ్రహ్మలోనున్న పదార్థ మేమిటి?:-
షష్ఠమ వేదం(రాంరళీయం)-4.
ఫెర్టైల్ ఓవమ్ భవిష్యద్బ్రహ్మలో వుండే పదార్థ మేమిటి?:- భవిష్యద్బ్రహ్మలో తండ్రినించి వచ్చిన 23 క్రోమోజోములూ తల్లి నించి వచ్చిన 23 క్రోమోజోములూ వెరసి 23 జతల క్రోమోజోములు అంటే 46 క్రోమోజోములుంటాయి.వీటితో పాటు తల్లి దండ్రులనించి సంక్రమించే జీన్స్ వుంటాయి. అను వంశిక వ్యాథులూ ,వ్యాథి నిరోధకాలూ సులక్షణాలూ దుర్లక్షణాలూ రూపు రేఖా విలాసాలన్నీ వుంటాయి.అంతేనా? అటు తండ్రి శరీరంలో ప్రతి జీవ కణంలో వుండే బ్రహ్మా విష్ణు మహేశ్వర్లు వచ్చి;అలాగే ఇటు తల్లి శరీరంలో వుండే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లూ వచ్చి కొత్తగా ఆవిర్భవించే జీవిలో చేరతారు.
ఇక ఏక కణంగా వున్న ఈ fertile ovum Mitotic divisions తీసుకుంటూ కణ
విభజనలు చేసుకుంటూ ఒక కణం రెండుగా ,రెండు నాలుగుగా,నాలుగు ఎనిమిదిగా ఎనిమిది పదహారుగా ..ఈ విధంగా రెట్టికి రెట్టింపవుతూ పెరగటం ప్రారంభిస్తుంది.ఈ స్థితి భవిష్య బ్రహ్మకు కృతయుగమన్న మాట!
ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పుకోక తప్పదు.నాలుగు, ఎనిమిది,పదహారు కణ విభజన సమయంలో ఈ బ్రహ్మను రెండు-నాలుగు ముక్కలుగా విడగొడితే ..ఏ ముక్కకా ముక్క మరో పూర్ణ జీవిగా (బ్రహ్మగా) అవతరించ గలదు (డు).ఇవే స్టెం సెల్స్ మూల కణాలు. ఈ కణాలు జీవి పుట్టినప్పుడు ఆ జీవి బొడ్డు తాడులో వుంటాయి.వీటిని అవసరాన్ని బట్టి ప్రత్యేక అవయవాలుగా మలచుకోవచ్చు.కన్ను,ముక్కు,గుండె కాయ ,కాలేయం,ప్లీహం,ఎముకలు ఈ విధంగా తయారు చేయ వచ్చు.ఈ ప్రక్రియను ప్రస్తుతం సైంటిస్టులు చేసి మానవుల్లో repair work చేస్తున్నారు.అలాగే జీన్ ట్రాన్స్ప్లాంటేషన్ పనులు చేబడుతున్నారు.ఇదే హిందువుల ఏకో నారాయణ సూత్రం. సహస్రాక్ష,సహస్ర శిర సహస్ర పాత్ అంటూ నారాయణుని అభివర్ణించే శ్లోకం ఈ మూల కణానిదే!?అన్నీ నువ్వే అన్నిటా నువ్వున్నావు.అంతా నువ్వే అనే శ్లోకాలన్నీ ఈ మూల కణాలకి స్థిర పడతాయి.
ఇలా కణ విభజన చేసుకుంటూ పోతున్న బ్రహ్మ(fertile ovum) ఒక స్థితికి చేరుకున్నాక దీనిలో పగుళ్లు మొదలౌతాయి.ఇంతవరకూ గుండ్రంగా బెలూనులా వున్నట్టగుపడే ఈ బ్రహ్మ పదార్థం cleavases తీసుకోవటం మొదలెడుతుంది.అలా పగులు చూపిన బ్రహ్మ వసు-రుద్ర-ఆదిత్య రూపాలని దాలుస్తుంది.వాసు రూపం అంటే పాము రూపం. రుద్ర రూపం అంటే స్థూపాకారం-(లింగాకారం) ఆదుత్య రూపం అంటే సప్తాశ్వారూఢుడై ముందుకు సాగుతున్నాడన్న మాట. See chick and human embriology
1.బ్రహ్మ కణ విభజన తీసుకున్నాడు.బ్రహ్మ తనకు పుట్టిన (మైటోటిక్ విభజన ద్వారా) కణంతోనే తా కలిసి మరో కణాన్ని సృష్టిస్తూ పోతున్నాట్ట.కాబట్టి మొదట పుట్టిన కణం బ్రహ్మకి కూతురైంది.ఆమెతోనే బ్రహ్మ రమించి మరోకణాన్ని పుట్టిస్తున్నందువల్ల బ్రహ్మ కూతుర్ని పెళ్లాడినట్లు హిందూ వేదాలు చెబుతాయి.బ్రహ్మ కూతురు -భార్యని సరస్వతి-వాణి-శారద అని అనేక పేర్లతొ పిలిచి హిందువులు పూజిస్తారు.సరస్వతి అంటే knowledge జ్ఞానం.అంతరమున జ్ఞాన మున్నందువల్లే కణం విభజన చేసుకో గలుగుతోంది.ఈ సరస్వతి బ్రహ్మ నాలిక పై వుంటుందట. అంటే భర్త ఆదేశాలననుసరించి కణ విభజనలు చేసుకుంటూ పోతోందన్న మాట!హైందవం ముందుగానే ఈ విషయం చెప్పింది వేదాల ద్వారా.ఆశ్చర్యమేమంటే హిందూ ఋషులు మెడిటేషన్ ద్వారా ఈ రహస్యం చెప్పుకున్నరేమో?నేడు చెప్పే విజ్ఞానం నాడే వేదాలు ఘొషించటం నిజంగా విడ్డూరమే!
2.First cleavase:- బ్రహ్మ మొదటి పగులు. ఇలా పగుళ్లు చేసుకున్న బ్రహ్మ తదుపరి పెనిసిలు ఆకారం దాలుస్తాడు.
3.పెన్సిల్ ఆకాఅం:-ఇదే వసు రూపం.పాములా పొడుగ్గా సాగుతుంది.
4.రుద్ర రూపం-లింగాకారం: పరీక్ష నాళికలా -పెన్సిల్ ములుకులాగున్న ఎదర భాగం లోనికి చొచ్చుకుపోవడం మొదలౌతుంది. అలా వెళ్లి గొట్టంలో గొట్టంలా A test tube in a test tube లా మారుతుంది.పై గొట్టం చర్మం,శరీరావయ వాలను తయారు చేసుకుంటుంది. లోని గొట్టం అన్న వాహికగా మారుతుంది.లింగా కారంలో వుండే శివుడికి నోరుంది.ఇతర అవయవాలన్నీ వున్నాయి.కాని,అతడ్ని లింగాకారంలోనే హిందువులు పూజిస్తారు.ఇప్పటికి శివుడు తయారయ్యాడన్న మాట.
5.Budding stage:కొమ్మలు పొడుచుకు వచ్చుట:- ఆదిత్య రూపం:- 4th. stage లో తయారైన రుద్ర రూపం నించి చేతులూ-కాళ్లూ మొగ్గలు తొడుగుతున్నట్లు తన్ను కొస్తుంటాయి.ఇవే సప్త ధాతువులు తమ తమ స్థానాల్లో నిబద్ధతతో అమరే ప్రయత్నం.సప్త సిధువులు,సప్త వర్ణాలు,ఇలాటి వన్నీ రూపు దిద్దుకునే ప్రయత్నం.అందువల్ల దీన్ని ఆదిత్య రూపం అనవచ్చు.
పురాణాలు వాస్తవాలనీ హిందూ ౠషులు సత్య సంథులనీ వారెప్పుడూ అబద్ధాలు చెప్ప లేదనీ మనం నమ్మినప్పుడే;వారు చెప్పిన శాస్త్రాల్లోని సత్యం హేతు పరంగా ,భౌతిక రసాయన పరంగా ఆథునిక విజ్ఞాన శస్త్ర పరంగా మనకి కనిపిస్తుంది.అందువల్ల వారు చెప్పిన వన్నీ సత్యంగా భావించి విశ్లేషించట్మ్ జరుగుతోంది.
భవిష్య బ్రహ్మ రుద్ర రూపం దాల్చినప్పుడు ఆ రుద్ర రూపమైన లింగాకారుడు తల్లి గర్భాశయ గోడలకు (Uterine wall)అతుక్కుంటాడు.అలా అతుక్కుని తల్లినించి ఆహారాన్ని సేకరించుకుంటూ వృద్ధి చెందుతూ పిండ రూపం దాల్చే ప్రయత్నంలో పడతాడు. ఈ పిండాన్ని తల్లి లోన పెరిగే పరాన్న జీవిగా భావిస్తారు.A foetus is nothing but a parasite in the mother's womb which lives on mother's food.