ఇప్పుడు ప్రళయ కాలాన్ని మరోసారి గుర్తు చేసుకోవాలి- ప్రళయ కాలంలో సోమకుడనే రాక్షసుడు వేదాలని తస్కరించి నీటి మడుగున దాస్తాడు. ఆ సోమకుడనే రాక్షసుని విష్ణువు చేప రూపం దాల్చి చంపుతాడు.వేదాలని పరిరక్షించి పడవలోకి చేర్చి ఆ పడవను ఒడ్డుకి చేరుస్తాడు.
ఇక్కడ పిండం పెరుగుదలను అడ్డుకునే ప్రయత్నం చేసే వాడు సోమకుడు.వాడు జీన్స్ నీ-పెరుగుదలకుపయోగ పడే కోడ్స్ నీ,కోడాన్స్ నీ .. ఇవే వేదాలు.వీటి నన్నిటినీ పెరిగే పిండానికందకుండా చేసే ప్రయత్నం చేస్తాడు. ఈ సోమకుని మాతృ రక్తంద్వారా మాతృగర్భంలోకి ప్రవేసించిన విష్ణువు చేప రూపం దాల్చి చంపుతాడు. చేప రూపంలోనున్నవి తల్లి రక్తం నించి వచ్చే రోగనిరోధకాలు Antibodies రుద్ర రూపం దాల్చిన ఈ బ్రహ్మ నిజానికి ఒక పడవ లాటి వాడు. ఈ పడవే బ్రహ్మకు రూపు దిద్దుకునే ఆకారం.అందుకే ఈ పడవలోనికి వేదాలని చేర్చడం జరిగింది.ఇప్పుడీ పడవ నీటి ఆటు పోట్లని తట్టుకుందుకు వీలుగా చేపరూపంలోనున్న హరి (విష్ణువు)ఈ పడవను తీసికెళ్లి తల్లి గర్భాశయ గోడకి గట్టిగా కట్టి పారేస్తాడు.
ఇంక కృతయుగంలోని హిరణ్యాక్షుడి కథ మొదలౌతుంది.గోళా కారంలోనున్న ఈ భూమిని (పిండం) ఈ రాక్షసుడు చాప చుట్టలా చుట్టి నీటి మడుగులో పడేస్తాడు. అలా నీటి మడుగులో పడిపోయిన భూమిని (పిండాన్ని) హరి ఆది వరాహ రూపందాల్చి హిరణ్యాక్షుని చంపి,నీటిపై తేలేలా చేస్తాడు.
గుండ్రంగా గోళంలా వున్న భూమిని (బ్రహ్మ పదార్థాన్ని) బీటలు cleavases తీసిన సమయంలో ఆ రాక్షసుడు చాపలా చుట్టి -అదే పెన్సిల్ ఆకారం, రుద్ర రూపంగా చుట్టి తల్లి గర్భాశయంలోని రక్తపు మడుగులో పడేస్తాడు. ఒక వేళ ఇది ఈ రూపంలోనే వుండి పోతే ముసలం (రోకలి)పుట్టినట్లుగా స్థూపాకారంలోనున్న బ్రహ్మ పదార్థం తల్లి గర్భం నించి బయటకు తన్ను కొచ్చేస్తుంది.అందుకోసం ఈ స్థూపాకారాన్ని మరల పిండ రూప దశలోకి మార్చి (గోళాకారంలోకి)రక్తపు మడుగులో మునిగి పోకుండా తేలేలా చేసే బాధ్యతను హరి తీసుకుంటాడు. ఒక బెలూన్లో వున్నట్టు ఈ పిండం (బ్రహ్మ)తల్లి గర్భాశయంలో మడుగులో తేలుతూ వుంటుంది.
ఈ ఆది వరాహ రూపం శ్రీ మహా విష్ణువు ఎక్కడ్నించి ఎలా వస్తున్నాడు?- తల్లినిండి వచ్చే యుటిరైన్ ఆర్టరీ గర్భాశయంలోనికి చొచ్చుకుని,పిండం
బొడ్డుకు అను సంథానమై,పిండాన్ని రక్తపు మడుగులో తేలేలా చేస్తుంది.ఈ uterine arteryగుండా శ్రీ మహా విష్ణువు పయనించి,పిండాన్ని రక్తపు మడుగులో తేలేలా చేస్తాడు.ఎవరి పనులు వారు పూర్తి చేసిన తరవాత వారు తప్పుకోవలసిన అవసరముంది. ఎందుకంటే భవిష్యతులో వారి అవసరముండదు.అందువల్ల సోమకుడు హిరణ్యాక్షుడూ చచ్చిపోయారు.ఇదెలాటిదంటే.. ఒక స్ఫుట్నిక్ ను అంతరిక్షంలోకి పంపేటప్పుడు,బేస్ లో ఉపయోగించిన రాకెట్ తన పని పూర్తి కాగానే కింద పడిపోతుంది.ఆ తరవాత నిర్దిష్ట దూరం పయనించాక మరో రాకెట్ పేలి స్ఫుట్నిక్ ని మరి కొంత దూరం తీసి కెళ్తుంది. అక్కడ పానెల్స్ విడి వడ్డం ,నిర్దిష్ట కక్ష్య లో స్ఫుట్నిక్ తిరిగే ఏర్పాట్లని మరో యంత్రం చూసుకుంటుంది. అలాటి యంత్రాల్లాంటివే ఈ జీవ ప్రక్రియలో వున్న వన్నీ.వీటిలో వున్న కోడ్స్ -కోడాన్సూ జీవ పరిణామ క్రమాన్ని నిర్దేశిస్తూ వుంటాయి.వీటినే హిందూ పురాణాల్లో యంత్రాల పేర్లతో వ్యవహరించకుండాబ్రహ్మ-విష్ణు-మహేశ్వరులనీ,రాక్షసులనీ దేవతలనీ వ్యవహరించారు.కారణం ఇదంతా బయొలాజికల్ మాటర్ లోనున్న బయొలాజికల్ మాటర్స్.Biological matters in Biological matter have been given some name instead of giving numbers by the present scientists. అంతే కాదు .. నిర్జీవం అనుకునే వాటిలోనూ జీవం వుందనీ అదే శక్తి రూపమనీ వాటిక్కుడా నిర్దిష్ట లక్ష్యాలున్నయనీ హిందూ ఋషులు గ్రహించి ఈ త్రిమూర్తుల ఆధారంతోనే జీవ నిర్జీవాలన్నిటి మీదా పురాణ రూపంలోనూ,వేదాల రూపంలోనూ చెప్పారు.Note: శక్తి (energy termed as femenine gender.This energy is being absorbed by Mother AdiSakti.The demon mahishasura when sheds blood from each drop of his blood several millions of demons mahishasurs will take birth.By drinking all drops of blood before blood drops fall on earth Mother killed him is a story present in Devi bhagavatam.Energy enters into energy. అందుకే ఆమెను శక్తి అన్నారు.ఆవిడ అన్నిటినీ తనలో విలీనం చేసుకుంటుంది.ఆ విధంగా పురుషుడు ఆటం బాంబులా పేలితే వాని లోంచి రిలీజ్ అయ్యే శక్తి ఆమె లో జీర్ణమై లోకం చల్ల బడుతుంది.
టెలిస్చోప్ కనుక్కోక పూర్వమే ఖగోళ శాస్త్రం విడమర్చి చెప్పిన ఋషులు,మైక్రోస్కోప్ కనుక్కోక పూర్వమే శరీర ధర్మాల్నీ,శాస్త్రాలనీ అణుమాత్రం తేడా లేకుండా చెప్ప గలిగారు.దానిక్కారణం వారి అంతర్ దృష్టి. ఏకాగ్రత.తపోనిష్ఠ. వారి ఆలోచనా సరళిలో వారు ఫిక్షన్ గా రాసినా అవి నిజాలయ్యాయి.లేదూ పూర్వం ఒకప్పుడు విజ్ఞాన శాస్త్రం ఈ భూమిపై పరిఢవిల్లి ఆ తరవాత నశించి వుండ వచ్చు. గతంలో వారు చూసిన వాటిని అభూత కల్పనలు లేకుండా వారు మనకందించి వుండవచ్చు. పురాణాల్లో అబద్ధాలు చెప్ప దల్చుకునంట్లైతే మన పూర్వీకులు రంకులనీ-బొంకులనీ ఉన్నదున్నట్టుగా రాయరు.మసి పూసి మారేడు కాయ చేసే వారు.అలాటిది వారు చెయ్య లేదు.ఉన్నదున్నట్టుగా రాశారు.వాటిని అర్థం చేసుకోలేని నేటి ఆథ్యాత్మిక వాదులు ఏదో కప్ప దాట్లు వేస్తూ తమకు తోచిన అర్థాన్ని వెలికి తీసే ప్రయత్నం చేసి,నేటి సామాజిక పరిస్థితులకనుగుణంగా నీతి-న్యాయాలని చొప్పించి వారు చెప్పిన దానికి వక్ర భాష్యం ఇస్తున్నారు.ఇంక-హేతు వాదులు నాస్తిక వాదంతో పురాణాలన్నీ పుక్కిటి పురాణాలనీ,కట్టు కథలనీ కొట్టి పారేస్తున్నారు.నాటి రోజుల్లో వున్న జాబాలి మహర్షిని గురించి గానీ చార్వాకుని గురించి గానీ మరెవరి గురించైనా గానీ వారు వున్న దున్నట్లుగా రాశారన్నది మర్చిపోరాదు.అహల్య కథా-పంచ భర్తృక పాంచాలి కథా,కర్ణుడి
కథా,కుంతీ-మాద్రీ దేవతల ద్వారా బిడ్డలను కన్న కథలూ యథా తధంగా రాశారే గాని,వాటిని ఏదో మార్చి రాశే ప్రయత్నం చెయ్య లేదు.సత్యమే వ జయతే!వారి సూత్రం.
-
- http://pruthviart.blogspot.com/
- 2009-05-25 @ 11:34:35
రాంరళీయం చాలా ఆసక్తి కరంగా ఆధ్మాత్మికతను వివరించారు. చాలా బాగా నచ్చింది. ఇంకా ఉపయోగకరమైన ఆలోచనాత్మకమయిన ఉన్నతిని కలిగించే అంశాలు చదువగలనని ఆకాంక్షిస్తున్నాను.