రాంరళీయం-8.
ఇక హిరణ్య కశిపుడూ-నారసింహావతార కథ:-
పిండ దశలోనున్న జీవికి నాడీ మండల వ్యవస్థ ద్వారా నారాయణ మంత్రోప దేశం జరిగింది.నారదుడి వల్ల ఆ పిండం తపస్సమాధిలో వుండి తదేక ధ్యానం చేస్తోంది.ఇటువంటి మంత్రం వల్ల హిరణ్య కశిపునికి కోపం
వస్తుంది.నిజానికి ఆపిండం తన కొడుకే! అయినా మానవ రూపం దిద్దుకోకుండా తనలాగే రాక్షస రూపంలో రాక్షస కృత్యాలు చేసే పాడు పనులు చేసే చెడ్డ బాక్టీరియా గనో-వైరస్ గానో మార్చాలని హిరణ్య కశిపుడు శతథా ప్రయత్నిస్తుంటాడు. అప్పుడు శ్రీ మహా విష్ణువు ఉగ్ర నరసింహ రూపం దాల్చి,హిరణ్య కశిపుని చంపి,ప్రహ్లాదుని రక్షిస్తాడు.ఈ ఉగ్రనరసింహ రూపం పిండం-పిండంలోకి ప్రవేశించిన విష్ణు మూర్తే! ప్రహ్లాదుని (ఆనందంగా వుండే ) ఆ రూపం దాల్చే వరకే ఈ హిరణ్య కశిపుడు గానీ, ఆ తరవాత అతని అవసరం లేదు.ఈ హిరణ్య కశిపుడు బ్రహ్మనే ధ్యానించే రకం. అందుకోసం బ్రహ్మనే ధ్యానిస్తూ కూచున్న దుర్మార్గపు పనులు చేస్తున్న ఈ హిరణ్య కశిపుని విష్ణువు చంపాడు.
శివుని ఆద్యంతాలను కనుక్కునే ప్రయత్నంలో -బ్రహ్మ-విష్ణువులు:-
రుద్ర రూపంలో స్థూపాకారంలో తల్లి గర్భా శయంలో నున్న పుట్ట బోయే జీవిని రల్లి రక్త నాళం నించొచ్చిన బ్రహ్మ విష్ణువు సందర్శించారు.వారికి ఈ లింగాకారం ఎంత ఎత్తుందో చూడాలని పించింది.బ్రహ్మ పైకి విష్ణువు కిందకీ వెళ్లి లింగా కారాన్ని కొలిచి,మళ్లీ ఇద్దరూ బొడ్డు దగ్గర కొచ్చి మాటాడుకున్నారు.బ్రహ్మ శివుని జటాజూటాన్ని చూశానని అబద్ధ మాడాడు.దాంతో శివుడు కోపించి బ్రహ్మకి పూజల్లేకుండా శపించాడు.విష్ణువు లింగా కారం మొద (ఆది) ఎక్కడుందో తను కనుక్కో లేకపోయానని ఒప్పేసుకున్నాడు. అందువల్ల శివ కేశవులిద్దరికీ పూజలున్నాయి.ఇదే కథ మన పురాణాల్లో ప్రచారమైంది.
స్త్రీ ప్రతి కణంలోనూ ,అలాగే పురుషుని ప్రతి కణంలోనూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురూ వుంటారు.అందువల్ల తల్లి నించీ-తండ్రి నించీ వచ్చిన ఆ మువ్వురూ ఒకరితో నొకరు గుణింపబడి 3x3అయి9 మంది అయి స్థూపాకారంలో నున్న శివునిలో ఐక్య మయ్యారు. వీరికి మియోటిక్ డివిజన్ వుండదు.వీరు ఒకరితో ఒకరు గుణింప బడతారే గాని రెట్టింపవరు.అందువల్ల నవగ్రహాలనీ తనలో ఇముడ్చుకున్న స్థూపకారంలోనున్న శివునిలా లింగా కారంలో పుట్ట బోయే బ్రహ్మ కనిపిస్తాడు.ఇప్పుడు తల్లి రక్త నాళం నించి మరో మువ్వురు (త్రిమూర్తులు) పుట్టబోయే బ్రహ్మని కలిసి అనుసంధానమయ్యారు. ఆ విధంగా పుట్ట బోయే జీవిలో 9x3= 27 చోటు చేసుకున్నాయి.ఈ 27 అశ్విని నుంచి మొదలై రేవతి తో అంతమయ్యే నక్షత్రాలు. తల్లినించి రక్త నాళం ద్వారా వచ్చిన శివుని శివుడు తనలో లయం చేసుకుని ఏకరూపిగా కనిపిస్తాడు.శివుడు మృత్యుంజయుడు.నిత్యుడు.ప్రళయం తదుపరి కూడా మిగిలే వాడు.అసలు ప్రళయం లయ కారకుడైన శివుని మూడో నేత్రం తోనే జరుగుతుంది.శరీరంలో చేరిన ఈ 27 నక్షత్రాలకీ ఒక్కో నక్షత్రానికీ 4 పాదాలుంటాయి. ఆ విధంగా 27x4=108. ఇదే అష్టోత్తర శతం. దీన్ని పుట్ట బోయే బ్రహ్మ జపిస్తాడు.ఇందులో మధ్యలోనున్న "0"(సున్న) కు విలువ లేదనే భావనతో అష్టాదశ పురాణాలు వెలువడ్డాయి.భగవద్గీతలో 18 అథ్యాయాలూ ,మహా భారతం 18 పర్వాలూగా రచన చెయ్యటం జరిగింది.శరీరంలో 18 essential amino acids వుంటాయి. ఈ amino acids కి ఒక దాన్నుంచి మరొకటి తయారు చేసుకునే ఏర్పాటు వుంది.Biochemistry చెప్పే సూత్రం AGPT combinations లో మార్పు చెందుతాయి. దీనికి codes-codons actచేస్తాయి. జీవ ప్రక్రియలో ఇదొక భాగం.
ఇంక పురాణ కథ ప్రకారం బ్రహ్మ శివలింగ ఊర్థ్వ భాగాని కెళ్లాడు. అక్కడ బ్రహ్మ పదార్థం మేథస్సుగా (మెదడు)మారింది.ఈ మెదడు నాలుగు భాగాలు. frontal lobe- 1,lateral lobes 2,posterior lobe -1. ఇదే చతుర్ముఖ
బ్రహ్మ ! జీవి సృష్ట్యాదిని ఈ నాలుగు ముఖాలనించీ 4 వేదాలు పుట్టాయంటారు. ఆ వేదాలలో క్రోడీకరించి కోడ్ చేసిన దాన్ని బట్టి జీవి పెరుగుదల జరుగుతుంది.శివుడు బ్రహ్మపై కుపితుడై వెనుక భాగాన వున్న నాలుగవ తలను నరికే శాడంటారు.అందువల్ల posterior lobe వెనక్కి తన్నుకుంటూ పోదు Hydro cephalus అనే వ్యాధిలో లాగున..అయీఅ అక్కడ వుండె medulla పిట్యూటరీ గ్రంథుల చాలా పనులే చేస్తాయి.ఇప్పుడీ మెదడులోని right lobe,left lobe లలో కొన్ని సెంటర్లుంటాయి. ఒక్కో సెంటరూ ఒక్కో పని చేస్తుంది.జ్ఞాపక శక్తి సెంటరు మెదడు ముడుతల్లో వుంటుంది.,నవ్వు సెంటర్,ఏడుపు సెంటర్ ఇలా అన్నీ ఇందులో నిక్షిప్తమై వుంటాయి. ఈ మెదడులో వుండేది ఎక్కువ నీరు.ఈ మెదడు ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటుంది.ప్రాణ వాయువందకుంటే ముందు ఈ మెదడే (బ్రహ్మ) చనిపోతాడు. ఈ మెదడు త్వరగా అలిసి పోతుంది.హెచ్చు విశ్రాంతి కోరుతుంది.మగతలో నిద్రిస్తూ పిండ దశలో వుంటుంది (తపస్సమాధిలో ఉన్నట్టు)కానీ శరీర ప్రక్రియలన్నీ జరిపిస్తూ పెరుగుదల కుతోడ్పడుతుంది.
-
రాంరళీయం-8.నారసింహావతార కథ:-
@ 2008-12-31 – 12:07:45
-
రాంరళీయం-7.సీతమ్మ వనవాసం.
@ 2008-12-31 – 07:43:47
ఇక సీతమ్మ వారు-అశోక వనం:- అందులో సీతమ్మకు రామ ముద్రికను (ఉంగరం)అందించటం కథ కొస్తే .. స్త్రీని సంభోగించిన వాడు రాముడు.ఆ రాముని దూతగా దిగిన వాడు హనుమ అతను రాముని సందేశాన్నీ, అతని ఉంగరాన్నీ అండానికందచేశాడు. (అండాలన్నీ సీతలు కావు.పుట్టే ప్రతి స్త్రీ సీత కానేరదు. అలాగే సంభోగించిన ప్రతి వాడూ రాముడు కాడు.ఇంక లోనికెళ్లిన ప్రతి వీర్య కణం హనుమలా వున్నా హనుమ కాక పోవచ్చు.రామ రావణ యుద్ధంలో ప్రవేసించిన కోతులు కావచ్చు.పుట్టే ప్రతి జీవి రాముడు కాక పోవచ్చు.అలా లోనికి వెళ్లిన హనుమ అండముతో కలిసి పిండ రూపి అయి,బాహ్యమునకు వచ్చి బ్రహ్మ రూపంలో బ్రహ్మ తేజంతో తాను సీతను సందర్శించానని చెప్పి ఆహ్లాదాన్నిస్తాడు తనకు పుట్టిన పిల్లనో పిల్ల వానినో చూచిన రాముడు (తండ్రి)ఆనందిస్తాడు.)ఈ కథ పునరుత్పత్తికే పరిమితం కాకుండా ఫిజిక్స్,కెమిస్ట్రీ,ఆస్ట్రాలజీ,ఆస్ట్రానమీ తదితర అన్ని శాస్త్రాలకీ విశ్వావిర్భావానికీ అన్నిటికీ అన్వయిస్తుంది కాబట్టి విడి విడి గా శస్త్ర పరంగా ఆలోచిస్తే అన్నిటిలోనూ ఈ కథ కనిపిస్తుంది.జ్ఞానమంతా ఒక చోటినించే మొదలౌతుంది.ఏకో నారాయణ! యిది మున్ముందు చెప్పటం జరుగుతుంది.)మరో ముఖ్య విషయ మేమంటే,వాల్మీకి రామాయణాన్ని రామ కథ జరుగక పూర్వమే నారదోప దేశతో రాశాడు.అంటే ..వాల్మీకి తన శరీరాంతర్భాగం లోనికి చూచుకుంటూ ,శరీరంలో జరుగుతున్న త్రేతాయుగపు రామాయణాన్ని చూచాడు!
విష్ణు మూర్తి నాభి కమలం నుండి బ్రహ్మ పుట్టాడని హిందూ శాస్త్రాలు ఘోషిస్తాయి.ఇప్పుడీ విష్ణు మూర్తి నాభి కమలం ఎక్కడుందో చూద్దం:-
తల్లి నించి వచ్చే యుటిరైన్ uterine artery ఆర్టరీ యుటిరస్ లోని పిండం నాభికి అనుసంథానమై పిండం పెరుగుదలకు తోడ్పడుతుంది.ఇప్పుడు తల్లి నించి వచ్చిన ఈ యుటిరైన్ ఆర్టరీ యే విష్ణు మూర్తి నాభి కమలం. (See diagrams and pictures of foetus in the mother's womb) దీన్ని బట్టి బ్రహ్మ విష్ణు నాభి కమలం నించి పుట్టాడని తెలుస్తుంది. పుట్టబోయే జీవి పిండ దశలో తల్లితో బొడ్డు ద్వారా అను సంథానమై,రక్తపు మడుగులో పైకి తేలతాడు.ఆ బ్రహ్మ చుట్టూ మాయా వరణంలాగు membrane పొర వుంటుంది.
విష్ణు మూర్తి తన నాభినించి పుట్టిన బ్రహ్మను సృష్టి కొన సాగించ మన్నాడు. బ్రహ్మ మానస పుత్రుడుగా నారదుడు (నాడీ మండలం)nervous system ,ఇంద్రుడు (ఇంద్రియాలూ అగైరాలు),కశ్యపుడు ఖెచరాలనూ,జలచరాలనూ,ఉభయ చరాలనూ ఇత్యాదుల్ని పుట్టించాడు.ఆదిత్యుడు.ఇంకా ఎందరో ఋషులు,ఋషి పత్నులు అందరూ పుట్టుకోచ్చి,ఎవరికి వారు తమ తమ పనులను పిండంలో చేసుకుంటూ పోతారు.(ముందు ముందు ఈ విషయాలు ప్రస్తావన కొస్తాయి.)అంటే శరీరం ఒక పెద్ద యూనివర్స్ అన్న మాట. శరీరంలోని ప్రతి చిన్న పార్టుకూ మన వాళ్లు పేర్లు పెట్టుకున్నారు.ఈది అంతా కష్టం కాబట్టి మైక్రో పార్టులకి అంకెలు నేటి సైన్సు వాదుతోంది. -
రాంరళీయం-6 వీర్య కణాన్ని హనుమతో పోల్చడమా?
@ 2008-12-30 – 17:45:35
రాంరళీయం-6 వీర్య కణాన్ని హనుమతో పోల్చడమా?
వీర్య కణాన్ని వీరాంజనేయుడనటం వల్ల మత ఛాందసులూ రామభక్తులూ కోపగించుకోవచ్చు. కాని,నేను అల్లా ఎందుకు చెప్పానో గ్రహించ గలరు.హనుమ పుట్టుక వెనుక గాథ విచిత్రం.శివుని వీర్యం వాయుదేవుడు తీసుకు పోతున్నాట్ట.అప్పుడు అంజనీ దేవి ఆ వీర్యాన్ని ఆఘ్రాణించిందిట.దాంతో ఆమెకు గర్భం వచ్చి హనుమ పుట్టాడు.అంజినీ దేవికేసరికి భార్య కూడ.
1.హనుమ తోక గల వాడు. -వీర్య కణానికి తోక వుంది.
2.కోతినించి మనిషి పుట్టాడు. -కోతి వలెనే వీర్య కణం వుండును.
3.హనుమంతుడు చిరంజీవి.ప్రస్తుతం తపస్సులోనున్నాడు. - పురుషుని వృషణంలో వీర్య కణం ఉత్పత్తి దశలో తపోనిష్ఠలోనే వుంటుంది(చిన్న పిల్లలలో)తరువాత నిద్రనించి లేస్తుంది.
4.హనుమే భవిష్యత్తులో బ్రహ్మ అవుతాడని వేద పురాణాలు చెప్పాయి. -ఈ వీర్య కణమే బ్రహ్మ రూపం దాల్చే మనిషి (మేథస్సు)
5.హనుమ సముద్రం లంఘించాడు.- వీర్య కణం యోని సముద్రంలో ఈదుకుంటూ వెళ్తుంది.
6.హనుమ లంకని చూచాడు.- వీర్య కణం అండాశయాన్ని చూస్తూ అందునించి వచ్చే అండంకోసం నిరీక్షిస్తుంది.
7.లంక సముద్ర మధ్యంలో ద్వీపంలా వుంది.- అండాశయాలు(overies0 లంకలాగే విడిగా వుంటాయి.
8.లంకలో ఎందరో స్త్రీలను హనుమ చూచాడు. -అండాశయంలోని అనేక అండాలు రావణ బందికానాలో వుండి విడుదల కాకుండా వుంటాయి.రావణుని ప్రియురాండ్రందరూ కోరి అతని లంకలో ఉన్న వారే(సీత తప్ప)
9.రావణుడు హనుమ పైకి 80 వేల కింకరులను హనుమను చంపుటకు పంపాడు.వారి నందరినీ హనుమ మట్టు పెట్టాడు.-ఇటువంటి 80వేల బాక్టీరియా గానీ మరేవైనా గానీ ఓవరీ నించి రాగలవు.వాటినన్నిటినీ చంపగల శక్తి ఒకే ఒక్క వీర్య కణానికుంటుంది.
10.హనుమ ప్రాసాదాన్ని ఎక్కి ఘోర నాదం చేసెను.అక్కడ ప్రాసాదమును కాపలా కాయు నూర్గురు రాక్షసులు హనుమ పై దాడి చేసిరి.వారిని హనుమ చంపెను.-సూక్ష్మ రూపంలోనున్న రాక్షసులు నూర్గురినీ చంపగల శక్తి వీర్య కణానికుంటుంది.
11.లంకేశ్వరుడు జంబు మాలిని పంపెను.అతడినీ హనుమ చంపెను.-ఈ శక్తి వీర్య కణానికుంటుంది.అది releaseచేసే వాసనలూ ఇతరత్రాలు.
లంకేశుడు ఏడుగురు మంత్రి పుత్రులను పంపెను.వారిని వారి సైన్యంతో సహా హనుమ చంపెను. ఇదీ వీర్య కణానికే సాధ్యం.
13.రావణుడు 5గురు సేనా పతులను పంపగా వారినీ హనుమ చంపెను.- వీర్య కణానికే సాధ్యం.
14.లంకేశుడు అక్షకుమారుని పంపెను.అతడినీ హనుమ చంపెను.-వీర్య కణానికే సాధ్యం.
15.ఇంద్రజిత్తును పంపెను.అతడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమునకు కట్టు బడెను. -అండ రూపంలో క్రిందకు దిగిన ఇంద్రియములను జయించిన ఇంద్రజిత్తు మత్తు చేయగా బద్ధుడై అండమును కలిసెను.
ఇంక సీతమ్మ వారు అశోక వనం:- గూర్చి తౌవాత చెప్పుకుందాం.
(యింకావుంది) -
రాంరళీయం పిండంలో కృతయుగం 5.
@ 2008-12-30 – 16:32:05
ఇప్పుడు ప్రళయ కాలాన్ని మరోసారి గుర్తు చేసుకోవాలి- ప్రళయ కాలంలో సోమకుడనే రాక్షసుడు వేదాలని తస్కరించి నీటి మడుగున దాస్తాడు. ఆ సోమకుడనే రాక్షసుని విష్ణువు చేప రూపం దాల్చి చంపుతాడు.వేదాలని పరిరక్షించి పడవలోకి చేర్చి ఆ పడవను ఒడ్డుకి చేరుస్తాడు.
ఇక్కడ పిండం పెరుగుదలను అడ్డుకునే ప్రయత్నం చేసే వాడు సోమకుడు.వాడు జీన్స్ నీ-పెరుగుదలకుపయోగ పడే కోడ్స్ నీ,కోడాన్స్ నీ .. ఇవే వేదాలు.వీటి నన్నిటినీ పెరిగే పిండానికందకుండా చేసే ప్రయత్నం చేస్తాడు. ఈ సోమకుని మాతృ రక్తంద్వారా మాతృగర్భంలోకి ప్రవేసించిన విష్ణువు చేప రూపం దాల్చి చంపుతాడు. చేప రూపంలోనున్నవి తల్లి రక్తం నించి వచ్చే రోగనిరోధకాలు Antibodies రుద్ర రూపం దాల్చిన ఈ బ్రహ్మ నిజానికి ఒక పడవ లాటి వాడు. ఈ పడవే బ్రహ్మకు రూపు దిద్దుకునే ఆకారం.అందుకే ఈ పడవలోనికి వేదాలని చేర్చడం జరిగింది.ఇప్పుడీ పడవ నీటి ఆటు పోట్లని తట్టుకుందుకు వీలుగా చేపరూపంలోనున్న హరి (విష్ణువు)ఈ పడవను తీసికెళ్లి తల్లి గర్భాశయ గోడకి గట్టిగా కట్టి పారేస్తాడు.
ఇంక కృతయుగంలోని హిరణ్యాక్షుడి కథ మొదలౌతుంది.గోళా కారంలోనున్న ఈ భూమిని (పిండం) ఈ రాక్షసుడు చాప చుట్టలా చుట్టి నీటి మడుగులో పడేస్తాడు. అలా నీటి మడుగులో పడిపోయిన భూమిని (పిండాన్ని) హరి ఆది వరాహ రూపందాల్చి హిరణ్యాక్షుని చంపి,నీటిపై తేలేలా చేస్తాడు.
గుండ్రంగా గోళంలా వున్న భూమిని (బ్రహ్మ పదార్థాన్ని) బీటలు cleavases తీసిన సమయంలో ఆ రాక్షసుడు చాపలా చుట్టి -అదే పెన్సిల్ ఆకారం, రుద్ర రూపంగా చుట్టి తల్లి గర్భాశయంలోని రక్తపు మడుగులో పడేస్తాడు. ఒక వేళ ఇది ఈ రూపంలోనే వుండి పోతే ముసలం (రోకలి)పుట్టినట్లుగా స్థూపాకారంలోనున్న బ్రహ్మ పదార్థం తల్లి గర్భం నించి బయటకు తన్ను కొచ్చేస్తుంది.అందుకోసం ఈ స్థూపాకారాన్ని మరల పిండ రూప దశలోకి మార్చి (గోళాకారంలోకి)రక్తపు మడుగులో మునిగి పోకుండా తేలేలా చేసే బాధ్యతను హరి తీసుకుంటాడు. ఒక బెలూన్లో వున్నట్టు ఈ పిండం (బ్రహ్మ)తల్లి గర్భాశయంలో మడుగులో తేలుతూ వుంటుంది.
ఈ ఆది వరాహ రూపం శ్రీ మహా విష్ణువు ఎక్కడ్నించి ఎలా వస్తున్నాడు?- తల్లినిండి వచ్చే యుటిరైన్ ఆర్టరీ గర్భాశయంలోనికి చొచ్చుకుని,పిండం
బొడ్డుకు అను సంథానమై,పిండాన్ని రక్తపు మడుగులో తేలేలా చేస్తుంది.ఈ uterine arteryగుండా శ్రీ మహా విష్ణువు పయనించి,పిండాన్ని రక్తపు మడుగులో తేలేలా చేస్తాడు.ఎవరి పనులు వారు పూర్తి చేసిన తరవాత వారు తప్పుకోవలసిన అవసరముంది. ఎందుకంటే భవిష్యతులో వారి అవసరముండదు.అందువల్ల సోమకుడు హిరణ్యాక్షుడూ చచ్చిపోయారు.ఇదెలాటిదంటే.. ఒక స్ఫుట్నిక్ ను అంతరిక్షంలోకి పంపేటప్పుడు,బేస్ లో ఉపయోగించిన రాకెట్ తన పని పూర్తి కాగానే కింద పడిపోతుంది.ఆ తరవాత నిర్దిష్ట దూరం పయనించాక మరో రాకెట్ పేలి స్ఫుట్నిక్ ని మరి కొంత దూరం తీసి కెళ్తుంది. అక్కడ పానెల్స్ విడి వడ్డం ,నిర్దిష్ట కక్ష్య లో స్ఫుట్నిక్ తిరిగే ఏర్పాట్లని మరో యంత్రం చూసుకుంటుంది. అలాటి యంత్రాల్లాంటివే ఈ జీవ ప్రక్రియలో వున్న వన్నీ.వీటిలో వున్న కోడ్స్ -కోడాన్సూ జీవ పరిణామ క్రమాన్ని నిర్దేశిస్తూ వుంటాయి.వీటినే హిందూ పురాణాల్లో యంత్రాల పేర్లతో వ్యవహరించకుండాబ్రహ్మ-విష్ణు-మహేశ్వరులనీ,రాక్షసులనీ దేవతలనీ వ్యవహరించారు.కారణం ఇదంతా బయొలాజికల్ మాటర్ లోనున్న బయొలాజికల్ మాటర్స్.Biological matters in Biological matter have been given some name instead of giving numbers by the present scientists. అంతే కాదు .. నిర్జీవం అనుకునే వాటిలోనూ జీవం వుందనీ అదే శక్తి రూపమనీ వాటిక్కుడా నిర్దిష్ట లక్ష్యాలున్నయనీ హిందూ ఋషులు గ్రహించి ఈ త్రిమూర్తుల ఆధారంతోనే జీవ నిర్జీవాలన్నిటి మీదా పురాణ రూపంలోనూ,వేదాల రూపంలోనూ చెప్పారు.Note: శక్తి (energy termed as femenine gender.This energy is being absorbed by Mother AdiSakti.The demon mahishasura when sheds blood from each drop of his blood several millions of demons mahishasurs will take birth.By drinking all drops of blood before blood drops fall on earth Mother killed him is a story present in Devi bhagavatam.Energy enters into energy. అందుకే ఆమెను శక్తి అన్నారు.ఆవిడ అన్నిటినీ తనలో విలీనం చేసుకుంటుంది.ఆ విధంగా పురుషుడు ఆటం బాంబులా పేలితే వాని లోంచి రిలీజ్ అయ్యే శక్తి ఆమె లో జీర్ణమై లోకం చల్ల బడుతుంది.
టెలిస్చోప్ కనుక్కోక పూర్వమే ఖగోళ శాస్త్రం విడమర్చి చెప్పిన ఋషులు,మైక్రోస్కోప్ కనుక్కోక పూర్వమే శరీర ధర్మాల్నీ,శాస్త్రాలనీ అణుమాత్రం తేడా లేకుండా చెప్ప గలిగారు.దానిక్కారణం వారి అంతర్ దృష్టి. ఏకాగ్రత.తపోనిష్ఠ. వారి ఆలోచనా సరళిలో వారు ఫిక్షన్ గా రాసినా అవి నిజాలయ్యాయి.లేదూ పూర్వం ఒకప్పుడు విజ్ఞాన శాస్త్రం ఈ భూమిపై పరిఢవిల్లి ఆ తరవాత నశించి వుండ వచ్చు. గతంలో వారు చూసిన వాటిని అభూత కల్పనలు లేకుండా వారు మనకందించి వుండవచ్చు. పురాణాల్లో అబద్ధాలు చెప్ప దల్చుకునంట్లైతే మన పూర్వీకులు రంకులనీ-బొంకులనీ ఉన్నదున్నట్టుగా రాయరు.మసి పూసి మారేడు కాయ చేసే వారు.అలాటిది వారు చెయ్య లేదు.ఉన్నదున్నట్టుగా రాశారు.వాటిని అర్థం చేసుకోలేని నేటి ఆథ్యాత్మిక వాదులు ఏదో కప్ప దాట్లు వేస్తూ తమకు తోచిన అర్థాన్ని వెలికి తీసే ప్రయత్నం చేసి,నేటి సామాజిక పరిస్థితులకనుగుణంగా నీతి-న్యాయాలని చొప్పించి వారు చెప్పిన దానికి వక్ర భాష్యం ఇస్తున్నారు.ఇంక-హేతు వాదులు నాస్తిక వాదంతో పురాణాలన్నీ పుక్కిటి పురాణాలనీ,కట్టు కథలనీ కొట్టి పారేస్తున్నారు.నాటి రోజుల్లో వున్న జాబాలి మహర్షిని గురించి గానీ చార్వాకుని గురించి గానీ మరెవరి గురించైనా గానీ వారు వున్న దున్నట్లుగా రాశారన్నది మర్చిపోరాదు.అహల్య కథా-పంచ భర్తృక పాంచాలి కథా,కర్ణుడి
కథా,కుంతీ-మాద్రీ దేవతల ద్వారా బిడ్డలను కన్న కథలూ యథా తధంగా రాశారే గాని,వాటిని ఏదో మార్చి రాశే ప్రయత్నం చెయ్య లేదు.సత్యమే వ జయతే!వారి సూత్రం. -
షష్ఠమ వేదం(రాంరళీయం)-4.భవిష్య బ్రహ్మలోనున్న పదార్థ మేమిటి?:-
@ 2008-12-30 – 10:33:16
భవిష్య బ్రహ్మలోనున్న పదార్థ మేమిటి?:-
షష్ఠమ వేదం(రాంరళీయం)-4.
ఫెర్టైల్ ఓవమ్ భవిష్యద్బ్రహ్మలో వుండే పదార్థ మేమిటి?:- భవిష్యద్బ్రహ్మలో తండ్రినించి వచ్చిన 23 క్రోమోజోములూ తల్లి నించి వచ్చిన 23 క్రోమోజోములూ వెరసి 23 జతల క్రోమోజోములు అంటే 46 క్రోమోజోములుంటాయి.వీటితో పాటు తల్లి దండ్రులనించి సంక్రమించే జీన్స్ వుంటాయి. అను వంశిక వ్యాథులూ ,వ్యాథి నిరోధకాలూ సులక్షణాలూ దుర్లక్షణాలూ రూపు రేఖా విలాసాలన్నీ వుంటాయి.అంతేనా? అటు తండ్రి శరీరంలో ప్రతి జీవ కణంలో వుండే బ్రహ్మా విష్ణు మహేశ్వర్లు వచ్చి;అలాగే ఇటు తల్లి శరీరంలో వుండే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లూ వచ్చి కొత్తగా ఆవిర్భవించే జీవిలో చేరతారు.
ఇక ఏక కణంగా వున్న ఈ fertile ovum Mitotic divisions తీసుకుంటూ కణ
విభజనలు చేసుకుంటూ ఒక కణం రెండుగా ,రెండు నాలుగుగా,నాలుగు ఎనిమిదిగా ఎనిమిది పదహారుగా ..ఈ విధంగా రెట్టికి రెట్టింపవుతూ పెరగటం ప్రారంభిస్తుంది.ఈ స్థితి భవిష్య బ్రహ్మకు కృతయుగమన్న మాట!
ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పుకోక తప్పదు.నాలుగు, ఎనిమిది,పదహారు కణ విభజన సమయంలో ఈ బ్రహ్మను రెండు-నాలుగు ముక్కలుగా విడగొడితే ..ఏ ముక్కకా ముక్క మరో పూర్ణ జీవిగా (బ్రహ్మగా) అవతరించ గలదు (డు).ఇవే స్టెం సెల్స్ మూల కణాలు. ఈ కణాలు జీవి పుట్టినప్పుడు ఆ జీవి బొడ్డు తాడులో వుంటాయి.వీటిని అవసరాన్ని బట్టి ప్రత్యేక అవయవాలుగా మలచుకోవచ్చు.కన్ను,ముక్కు,గుండె కాయ ,కాలేయం,ప్లీహం,ఎముకలు ఈ విధంగా తయారు చేయ వచ్చు.ఈ ప్రక్రియను ప్రస్తుతం సైంటిస్టులు చేసి మానవుల్లో repair work చేస్తున్నారు.అలాగే జీన్ ట్రాన్స్ప్లాంటేషన్ పనులు చేబడుతున్నారు.ఇదే హిందువుల ఏకో నారాయణ సూత్రం. సహస్రాక్ష,సహస్ర శిర సహస్ర పాత్ అంటూ నారాయణుని అభివర్ణించే శ్లోకం ఈ మూల కణానిదే!?అన్నీ నువ్వే అన్నిటా నువ్వున్నావు.అంతా నువ్వే అనే శ్లోకాలన్నీ ఈ మూల కణాలకి స్థిర పడతాయి.
ఇలా కణ విభజన చేసుకుంటూ పోతున్న బ్రహ్మ(fertile ovum) ఒక స్థితికి చేరుకున్నాక దీనిలో పగుళ్లు మొదలౌతాయి.ఇంతవరకూ గుండ్రంగా బెలూనులా వున్నట్టగుపడే ఈ బ్రహ్మ పదార్థం cleavases తీసుకోవటం మొదలెడుతుంది.అలా పగులు చూపిన బ్రహ్మ వసు-రుద్ర-ఆదిత్య రూపాలని దాలుస్తుంది.వాసు రూపం అంటే పాము రూపం. రుద్ర రూపం అంటే స్థూపాకారం-(లింగాకారం) ఆదుత్య రూపం అంటే సప్తాశ్వారూఢుడై ముందుకు సాగుతున్నాడన్న మాట. See chick and human embriology
1.బ్రహ్మ కణ విభజన తీసుకున్నాడు.బ్రహ్మ తనకు పుట్టిన (మైటోటిక్ విభజన ద్వారా) కణంతోనే తా కలిసి మరో కణాన్ని సృష్టిస్తూ పోతున్నాట్ట.కాబట్టి మొదట పుట్టిన కణం బ్రహ్మకి కూతురైంది.ఆమెతోనే బ్రహ్మ రమించి మరోకణాన్ని పుట్టిస్తున్నందువల్ల బ్రహ్మ కూతుర్ని పెళ్లాడినట్లు హిందూ వేదాలు చెబుతాయి.బ్రహ్మ కూతురు -భార్యని సరస్వతి-వాణి-శారద అని అనేక పేర్లతొ పిలిచి హిందువులు పూజిస్తారు.సరస్వతి అంటే knowledge జ్ఞానం.అంతరమున జ్ఞాన మున్నందువల్లే కణం విభజన చేసుకో గలుగుతోంది.ఈ సరస్వతి బ్రహ్మ నాలిక పై వుంటుందట. అంటే భర్త ఆదేశాలననుసరించి కణ విభజనలు చేసుకుంటూ పోతోందన్న మాట!హైందవం ముందుగానే ఈ విషయం చెప్పింది వేదాల ద్వారా.ఆశ్చర్యమేమంటే హిందూ ఋషులు మెడిటేషన్ ద్వారా ఈ రహస్యం చెప్పుకున్నరేమో?నేడు చెప్పే విజ్ఞానం నాడే వేదాలు ఘొషించటం నిజంగా విడ్డూరమే!
2.First cleavase:- బ్రహ్మ మొదటి పగులు. ఇలా పగుళ్లు చేసుకున్న బ్రహ్మ తదుపరి పెనిసిలు ఆకారం దాలుస్తాడు.
3.పెన్సిల్ ఆకాఅం:-ఇదే వసు రూపం.పాములా పొడుగ్గా సాగుతుంది.
4.రుద్ర రూపం-లింగాకారం: పరీక్ష నాళికలా -పెన్సిల్ ములుకులాగున్న ఎదర భాగం లోనికి చొచ్చుకుపోవడం మొదలౌతుంది. అలా వెళ్లి గొట్టంలో గొట్టంలా A test tube in a test tube లా మారుతుంది.పై గొట్టం చర్మం,శరీరావయ వాలను తయారు చేసుకుంటుంది. లోని గొట్టం అన్న వాహికగా మారుతుంది.లింగా కారంలో వుండే శివుడికి నోరుంది.ఇతర అవయవాలన్నీ వున్నాయి.కాని,అతడ్ని లింగాకారంలోనే హిందువులు పూజిస్తారు.ఇప్పటికి శివుడు తయారయ్యాడన్న మాట.
5.Budding stage:కొమ్మలు పొడుచుకు వచ్చుట:- ఆదిత్య రూపం:- 4th. stage లో తయారైన రుద్ర రూపం నించి చేతులూ-కాళ్లూ మొగ్గలు తొడుగుతున్నట్లు తన్ను కొస్తుంటాయి.ఇవే సప్త ధాతువులు తమ తమ స్థానాల్లో నిబద్ధతతో అమరే ప్రయత్నం.సప్త సిధువులు,సప్త వర్ణాలు,ఇలాటి వన్నీ రూపు దిద్దుకునే ప్రయత్నం.అందువల్ల దీన్ని ఆదిత్య రూపం అనవచ్చు.
పురాణాలు వాస్తవాలనీ హిందూ ౠషులు సత్య సంథులనీ వారెప్పుడూ అబద్ధాలు చెప్ప లేదనీ మనం నమ్మినప్పుడే;వారు చెప్పిన శాస్త్రాల్లోని సత్యం హేతు పరంగా ,భౌతిక రసాయన పరంగా ఆథునిక విజ్ఞాన శస్త్ర పరంగా మనకి కనిపిస్తుంది.అందువల్ల వారు చెప్పిన వన్నీ సత్యంగా భావించి విశ్లేషించట్మ్ జరుగుతోంది.
భవిష్య బ్రహ్మ రుద్ర రూపం దాల్చినప్పుడు ఆ రుద్ర రూపమైన లింగాకారుడు తల్లి గర్భాశయ గోడలకు (Uterine wall)అతుక్కుంటాడు.అలా అతుక్కుని తల్లినించి ఆహారాన్ని సేకరించుకుంటూ వృద్ధి చెందుతూ పిండ రూపం దాల్చే ప్రయత్నంలో పడతాడు. ఈ పిండాన్ని తల్లి లోన పెరిగే పరాన్న జీవిగా భావిస్తారు.A foetus is nothing but a parasite in the mother's womb which lives on mother's food. -
షష్ఠమ వేదం!! (రాంరళీయం)-2.
@ 2008-12-28 – 16:47:26
కొత్త జీవి ఆవిర్భావము:-కొత్త జీవి ఆవిర్భావానికి ముందు మనం స్త్రీ పురుష పునరుత్పత్తికి తోడ్పడే అవయవాలని గూర్చి తెలుసుకోవాలి.Search in internetపురుష శుక్లములో వుండే కోటానుకోట్ల వీర్య కణములే అంగద-జాంబవంతాది మహావీరులైన కోతి మూక. అందులో అందరికీ లంకలోనికి ప్రవేశార్హత కలగదు. జితేంద్రియుడు అధీక బలశాలి అణిమ-గరిమాది మహా సిద్ధులున్న వీరాంజనేయుని వంటి వానికే ఈ సముద్ర లంఘనం సాధ్య మౌతుంది. మహేంద్ర గిరి మీద కెక్కి,తాడించి కుప్పించి లంఘనము చేయ వలసి వుంది. ఇక్కడ మహేంద్ర గిరి అంటే పురుషాండమైన అడివిలోంచి బయట పడి, ప్రొస్టేట్ గ్లాండ్ వున్న మహేంద్ర గిరి మీంచి దూకుతుంటే తోడుగా మహేంద్ర గిరిలో నున్న వౄక్ష రాజములు ఎగిసి పడతాయి. అదే ప్రొస్ట్రేట్ గ్లాండ్ సెక్రిషన్స్. ఇవి వాయు దేవుని శైత్యోపచారములు సూర్యుని శీతలీకరణ జరుపగా వేగముగా ప్రయాణించును. Might is Right అనే నానుడి జీవి ఆవిర్భావం కోసం ఇక్కడే ప్రారంభమైంది.
ఇక స్త్రీ యోని లవణ సముద్రం. Alkaline in nature.ఇందులో హనుమంతుని,పుట్ట బోయే జీవిని,ప్రళయాంతమున కాబోయే బ్రహ్మను; సమ్హరించేటందుకు సురస వస్తే ఆమెను శక్తి యుక్తులతో తప్పించుకో గలగాలి.క్లైటోరిస్ clitoris అయిన మైనక పర్వతం పై విశ్రాంతి తీసుకోకుండా ఎదరకు పోవాలి. గర్భాశయంలో వుండే చాయా గ్రాహిణి అయిన సిమ్హిక వల్ల ఆకర్షింప బడి క్రిందకు దిగిపోయి precipitate ప్రెసిపిటేత్ కాకూడదు.ఎలాగోలా fallopian tube ఫాలోపియన్ త్యూబ్ ను చేరాలి.ఇదంతా చేయటానికి వీర్య కణానికి శక్తి యుక్తులు కావాలి. కొండొకచో వీర్య కణం పెద్దదిగానూ చిన్నదిగానూ మార గలగాలి. పోటీ తత్వంతో వేగం పెంచుకుని ముందుగా అండమును చేరి,అండము గోడను తొలుచుకుని లోపలికి చొచ్చుకు పోవాలి. అదీ 160 డిగ్రీల కోణములో?! ఈ ప్రక్రియలో ఎన్నో వీర్య కణాలు ఓడిపోతాయి. కొన్ని యోని ద్వారంలోనే కూల బడతాయి.కొన్ని యోనిలోంచి ఎదరకు వెళ్లి చతికిల బడతాయి.కొన్ని గర్భాశయం గోడల్లో uterine wall ఇరుక్కుని నశిస్తాయి.ఏ విధంగా చూసినా ఒక్క వీర్యకణానికే ఛాన్స్. వాడే భవిష్య బ్రహ్మ!! rare cases అరుదుగా రెండు వీర్య కణాలు రెండు ఓవం లు విడుదలైతే ఆ రెంటినీ చేరి ఫైదీకరణం fertileచ్/ఏస్తే ఇద్దరు భవిష్య బ్రహ్మలు పుడతారు.twins & triplets etc. కవలలూ-త్రిమూర్తులూ ఇత్యదులివన్నీను. కుక్కలూ-పిల్లులూ పందుల్లో ఇంకా ఎన్నో భవిష్య బ్రహ్మల ఉత్పత్తి జరుగుతుంది.
వీర్య కణాలు రెండు రకాలు. ఒకటి ఎక్స్ క్రోమోజోమ్ కలదైతే మరొకటి వై క్రోమోజొమ్ కలది.మొదటిది స్త్రీ సంతానోత్పత్తి చేసే దైతే రెండవది పురుష సంతానోత్పత్తికి పనికి వచ్చేది.
see:-
హ్త్త్ప్://ఉసెర్స్.ర్చ్న్.చొం/జ్కింబల్ల్.మ.ఉల్త్రనెత్/భిఒలొగ్య్ఫగెస్/శ్/శెక్ష్ఛ్రొమొసొమెస్.హ్తంల్
హ్త్త్ప్://ధుషర.ఫ్రీహొస్తింగ్.నెత్/బూక్/ఉప్ద్/ఔగ్201/క్ష్య్చ్ర్.హ్త్మ్
హ్త్త్ప్://వ్వ్వ్.బిఒలొగ్య్-ఒన్లినె.ఒర్గ్/2/6_సెక్ష్_చ్రొమొసొమెస్.హ్త్మ్
x స్త్రీ యోని రతిసమయంలో క్షీర సాగరం. యోనిలోనికి ద్రవించే బార్థోలిన్ గ్లాండ్ ద్రవాలూ-అటు పురుషుని అంగం నించి ద్రవించే ప్రొస్ట్రేట్ గ్లాండ్ ద్రవాలూ రెండూ కలిసి యోనిని క్షీర సముద్రంగా మారుస్తాయి. ఆ క్షీర
సాగరాన్ని మంథర గిరి వంటి పురుషాంగం తరిస్తుంది. చిలుకుతుంది.స్త్రీ జననేంద్రియంలోని ఓవరీలను లంకలుగా భావించ వచ్చు.వీటిలో స్త్రీకి పుట్టుకతో జన్మత: వున్న అండములే యుక్తవయస్సు రాగానే నెల కొకటిచొప్పున విడుదలై బయటకు వస్తాయి. అందూవల్లే స్త్రీలకు ఒక వయస్సు దాటే సరికి నెలసరులు ఆగిపోతాయి.Menopause.ఉజ్జాయింపుగా 45 సంవత్సరములు. ఈ ఓవరీస్ రావణ నిలయాలు. ఇందులో వుండే అండముల సంఖ్య constant from birth to death in females ఈ రావణుని అథీనంలోనున్న యక్ష -కిన్నెర కింపురుష-గంథర్వ,మానవ (మండోదరి) సీత అశోక వనంలో ?! -ఈ రెండూ ఎక్సెప్షన్స్ (అరుదైనవి) ఈ అండములోనించి స్త్రీలు ఒకరి తరవాత ఒకరు విడుదలై వస్తుంటారు. ఈ అండములను స్త్రీలు అనుటకు కారణం ఇవన్నీ xఎక్స్ క్రోమోజోమ్ లు గలవే!(యింకావుంది)
-
షష్ఠమ వేదం!! (రాంరళీయం)
@ 2008-12-28 – 11:06:43
షష్ఠమ వేదం!! (రాంరళీయం)
డా/పెయ్యేటి మురళీ మోహన రావు.(రాంరళి)
భారతీయ హిందూ తత్త్వ సిద్ధాంతం ఆథునిక విజ్ఞాన శాస్త్రంగా నిరూపించే ఏకైక తొలి గ్రంథం!దైవంలో శాస్త్రార్థాన్ని చూడమనే తొలి గ్రంథం. పురాణాల్లో చెప్పిన వాటికి నిరూపాత్మక వివరణ. భారతీయ పురాణేతిహాసాల ద్వారా మన పూర్వీకులు అయిన మహర్షులు మనకేమి చెప్పదలచుకున్నారో విజ్ఞాన పరంగా సహేతుకంగా విపులీకరించే గ్రంథం.సత్యమేవ జయతే!
మహా ప్రళయం సంభవించిన తదుపరి జీవ ఆవిర్భావం సంభవించిందని వేదాలు ఘోషిస్తున్నాయి. ఇంచుమించుగా అన్ని మతాల్లోనూ ఈ విషయం వుంది .. కొద్దిపాటి తేడాలతో!? జల ప్రళయం రావడం .. ఒక పడవలో జీవరాశినీ,వేదాలనీ చేర్చి మత్స్యావతారంలోనున్న శ్రీ మహావిష్ణువు ఆ పడవను ఒడ్డుకు చేర్చడం ,వేదాలను తస్కరించిన సోమకుడనే రాక్షసుడిని చంపడం ,ఆ తరవాత సారస్వత మనువు ద్వారా తిరిగి అవి ప్రజలకు అందడం వంటివి ఇందులో వుంటాయి.
ప్రళయం అంటే ఏమిటి?: అది ఎప్పుడు వస్తుంది?:- జీవి ఆవిర్భావానికి ముందు వచ్చేదే ప్రళయం. ప్రతి జీవీ ఆవిర్భవించడానికి ముందుగా ఈ ప్రళయం వస్తుంది. ఇది నిత్య ప్రళయం. స్త్రీ పురుషుల మధ్య ఆవిర్భవించే ప్రణయం! పరిణయం ,కామోద్దీపన కోర్కెలూ అన్నీ రాబోయే ప్రళయానికి సంకేతాలు. స్త్రీపురుషులిద్దరూ శ్రుంగార కేళి సల్పుతారు. అమృత తుల్యమైన ఆనందాన్ని ఆస్వాదించి మరో జీవి ఆవిర్భానికి నాంది పలుకుతారు.
ఇక్కడ మనం ముందుగా హిందూ పురాణాలని బట్టి క్షీర సాగర మథనం గూర్చి చెప్పుకోవాలి. క్షీర సాగర మథనం అంటే మరేదో కాదు. స్త్రీ పురుషులు జరిపే రతి కేళి!
స్త్రీ ఉపస్థు ఒక క్షీర సాగరం. పురుషాంగం మథరగిరి పర్వతం. అమృతోద్భవం కోసం పురుషుడు తన పురుషాంగాన్ని స్త్రీ ఉపస్థు అనే క్షీర సాగరంలో ముంచి చిలుకుతాడు.ఆ ప్రక్రియలో పురుషాంగం స్త్రీ గర్భాశయంలోకి పూర్తిగా వెళ్లి పోకుండా స్త్రీ సెర్విక్స్ అడ్డుకుంటుంది.ఈ సెర్విక్సనే శ్రీకూర్మం. పురుషాంగం అనే మంథర గిరిని సెర్వ్క్సనే శ్రీకూర్మం మునిగి పోకుండా నిలబెడుతుంది. దేవదానవులు ఇటు పురుషుడిలోనూ అటు స్త్రీలోనూ జేరి ఆ సముద్ర మథనం కొన సాగిస్తారు. స్త్రీ పురుష బాహు బంధనలూ,పాద బంధనలూ ఆది శేషువులా వుండి,పురుషాంగాన్ని సవ్యంగా పట్టి సముద్ర మథనం సవ్యంగా జరిగేలా చేస్తాయి. ఈ ప్రక్రియలో పుట్టే వన్నీ నూతన జీవి ఆవిర్భావానికి నాంది పలుకుతాయి. ఆ విధంగా అమృత పానం చేసిన స్త్రీ-పురుషులిరువురూ తృప్తి నొందుతారు.
(యింకావుంది) -
title-5258875
@ 2008-12-22 – 10:49:28
Thanks to one and all! I too reciprocate my warm good wishes to one and all of you on my birth day.My blessings to all!
I wish one and all to have a merry happy holy Christmus enjoyments
yours always,
Dr.P.M.Rao.