ఉన్మాదానికి పరాకాష్ఠ!!
హిందూ మతోన్మాదం పెరిగింది. హిందువులు కూడా అసలు హైందవానికే సిగ్గు చేటు తెచ్చేలా ప్రవర్తిస్తున్నారు.క్రైస్తవులను చంపుట-క్రైస్తవ మిషనరీ ఆస్తులను ధ్వంసం చేయుట చేసి బహు అనాగరికంగా ప్రవరిస్తున్నారు. దీనికి హిందూ మతమే సిగ్గు పడాలి.హైందవం దేవుని చేరేటందుకు ఎన్నో మార్గాలని సూచిస్తుంది. అందువల్ల ఎవరి అభిమతం వారిదయ్యింది. క్రైస్తవం భారతదేశంలోనికి హింసతో ప్రవేశించ లేదు. మానవత్వంతో క్రైస్తవం ఎందరో హిందువులను తమకు తాముగా క్రైస్తవంలోనికి మారేలా చేసింది.ఒక సమాజానికి దూరమైన కుష్ఠు వ్యాధి గ్రస్తుడు,కుల వ్యవస్థలో అగ్ర కులాల వారి వర్ణ వివక్షత వల్ల భంగ పడిన బడుగు జీవులు,ఆర్థికంగా వెనుక పడి సమాజంలో సమానత్వానికి దూర మైన జీవులు-మంత్ర -తంత్ర-యంత్ర-కర్మసిద్ధాంతాల ప్రాతిపదికను విభజనకు గురి అయిన దేశంలో తమకు తాముగా;క్రైస్తవ మతానుయాయులు విద్యా బోధనలు చేయటం వల్లా,తమతో సమాన ప్రాతిపదిక చూపటంతోనూ,అంట రానితనం లేని వ్యక్తుల వల్ల మతం కన్నా మానవత్వదౄక్పథంతో ,ఏ దేశంలో కాలు పెట్టినా,ఆ దేశంలో ఆస్పత్రులూ-విద్యా సౌకర్యాలూ,నీటి వనరులూ (డ్యాంలు కట్టి)ఏర్పాట్లు చూచి,ఉన్న భూములను పంటలు వేసుకునేటందుకు అనువుగా మార్చి-ఇంకా ఎన్నో మంచిపనులు చేసి భారతీయుల మనసులను దోచుకున్నారు.సహజంగానే తమ దేశం నించి దేవుని పేరిట తెచ్చిన చందా డబ్బులను నిస్వార్థ సేవకు ఖర్చు చేశారు.అందువల్ల వారు తమ దేవాలయాలను తాము కట్టుకుని ఆ దేవుని ప్రార్థించి,రోగాలు నయం కావాలని ప్రార్థనలు చేసే వారు. ఆ తరవాతే వైద్యం చేసే వారు.నాటి కాలంలో క్రైస్తవులను హిందువులు అంటరాని వారిగానే చూశారు.తెల్ల్ తోలు చూసి అది బొల్లి అనో శ్వేత కుష్ఠు అనో భావించారు. వారిని ముట్టుకున్నా వెంటనే స్నానం చేసి,పసుపు నీళ్లు జల్లుకుని,యింకా ఏవేవో మంత్రాలు చదువుకుని శుచి అయిందని భావించేవారు.అయితే మనుషులన్నాక రోగాలూ రొష్టులూ రాకుండా వుండవు కదా?! అందువల్ల తప్పని సరి పరిస్థితుల్లో ఆస్పత్రిలో బతకటం కోసం చేరే వారు. అక్కడ ఆంగ్లేయ వైద్యులు ఇచ్చే మిక్చర్లు- ద్రవరూపం తో వుండటంతో ఆ నీళ్లు తాగితే మైల పడతామనే భావనతో-"ఔషధీ జర్జరీ భూతే.. జాహ్నవీ తోయం', అనుకుని గుటుక్కున మింగి,ఆరోగ్యం సిద్ధింప చేసుకునే వారు.ఆ తరవాత యింటికి చేరాక బ్రాహ్మలైతే గాయత్రీ జపం చేసుకుని కిల్బిషం పోయిందనుకుని సంతృప్తి చెందేవారు.అదే మిగతా కులాల వారైతే,వారి వారి కుల ఆచారాల ప్రకారం శుద్ధి చేసుకునేవారు.
ఒక్క సారి మనం గతంలోకి వెడితే .. సైంట్ థామస్ అనే ఒక మత ప్రవక్త మొదట దక్షిణ హిందూస్థానంలో ప్రవేశించి,తాను ఎన్నో మిరకిల్స్ (అద్భుతాలను ప్రదర్శించి)చాలా మందిని క్రైస్తవంలోనికి మార్చారు. మొట్ట మొదటిగా ఆయన కొందరు మళయాళ ఛాందస బ్రాహ్మణులను నది లో స్నానం చేస్తూ సూర్యునికి అర్ఘ్యాలు సమర్పిస్తుంటే చూచి.. వారితో యెహోవా గూర్చీ-క్రీస్తు గూర్చీ చెప్పటం జరిగింది. అప్పుడా బ్రాహ్మలు-ఏదేని అద్భుతం చేసి చూపితే..తాము క్రీస్తును నమ్ముతామన్నారు.అప్పుడు సైన్ట్ థామస్ తన దోసిలితో నీళ్లు తీసి "తాను చెప్పింది నిజమైతే ఆ నీరు పుష్పాల్లా మారుగాక",అని ఆకాశం లోనికి విసిరాడు. అద్భుతంగా ఆ నీరు పువ్వులై కిందకు కురిసింది.వెంటనే ఆ బ్రాహ్మణులు క్రైస్తవం మొట్టమొదటి సారిగా స్వీకరించారు. తదనంతరం ఆయన వెళ్లిన చోటల్లా అద్భుతాలు చూపటం రోగాలు నయం చేయ్యటం చూసి మరి కొంతమంది మారారు. ఆయన అలా జనులను తమ క్రైస్తవంలోనికి తమకు తాముగా మారే వారిని మార్చుకుంటూ, మద్రాసు చేరుకున్నారు. అక్కడ హైందవ మతోన్మాద ఛాందసులు థామస్ ను మత మార్పిడీలు చేస్తున్నాడని రాళ్లతో కొట్టి చంపేశారు. ఇప్పటికీ చెన్న పట్నంలో సైంట్ థామస్ స్క్వేర్ ,థామస్ బ్రిడ్జి-థామస్ చర్చి ఉన్నాయి.ఇక పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు కుల మత ప్రసక్తి లేకుండా , కాటన్ దొర అంటే అవ్యాజమైన ప్రేమ.అక్కడి ప్రజలు నిత్య సంకల్పంలో పూజా విథానంలో కాటన్ దొరను కూడా చెప్పుకుంటారు. ఆయన వాశిష్ఠీ నదికి ఆక్విడక్టు నిర్మాణం చేసి,గోదావరి నీటిని పొలాలకు మళ్లించి పంటలు పండేలా చేసి,ఉభయ గోదావరీ పరీవాహక ప్రాంతాల్లో కరవు కాటకాలులేకుండా చేసి నిత్య స్మరణీయు డయ్యాడు.ఇలాటి నిత్య స్మరణీయుల్లో "మేడం అనిబెసెంటూ కూడా వస్తారు.
ఎప్పుడో క్రైస్తవంలోనికి మారిన నాటి హిందువులనీ-కొత్తగా క్రైస్తవంలోనికి తమకు తాముగా మారే వారినీ కొట్టే-హింసించే హక్కు హైందవానికుందా?హైందవం తీవ్ర వాదాన్ని వ్యతిరేకిస్తుందే?మనం ఒక వర్గాన్ని హింసకు గురి చేయటం వల్లే కదా వారు అలా మతం మార్చుకున్నది? అది వారి తప్పా-మన తప్పా??కొద్దిగా విణ్గ్ణ్జతతో ఆలోచించి మేధావులు నిర్ణయించాలి.ముస్లిమ్‌ల్ హైందవ స్త్రీలను బలవంతంగా వివాహం చేసుకుని,పురుషులను చంపి మత మార్పిడీకి కారకులైనట్లు క్రైస్తవులు కాలేదే??
యిక పోతే నేడు కర్ణాటకలో క్రైస్తవ చర్చిలను ధ్వంసం చేయటం -క్రైస్తవులను ,హిందువులను తమ మతంలోనికి మారుస్తున్నారని చంపటం ఎంత తప్పు?చేతనైతే-నీ బోధనలతో, మహిమలు చూపించి నీ హైందవంలోనికి వారిని మార్చండి??! అబ్బే ఇది కుదరదు. ఎందుకు? పుట్టుకతోనే హిందువుగా పుట్టాలి. సరే యిప్పుడు ఈ హైందవ మత ఛాందసులు క్రైస్తవులకు గుండు గీసి-హిందూ మతం యిస్తున్నారట!(జిజియా పన్ను విధించిన మహమ్మద్ బీన్ తుగ్లక్ గుర్తుకొస్తున్నాడు వీరి చేష్టలు చూస్తుంటే!)తలలు బోడులైన తలపులు బోడులగునా అన్నట్టు-మనస్సులో ఏసుని తలుస్తూ గుండు కొట్టించుకుంటే హిందువవుతాడా?సరే! మహమ్మదీయ మతంలో కూడా గుండు కొట్టించుకోవడం వుందిగా?గుండు హిందూ సాంప్రదాయమైతే మనలో ఎందరు అది పాటించి గుండుగాళ్లలాగుంటున్నారు? యిక క్రైస్తవ స్త్రీలకు ఈ ఛాందసులు గాజులు తొడిగి-బొట్టు పెట్టి హైందవం యిచ్చేస్తున్నారట?! యింకా క్రైస్తవుల చేత మంత్రాలు చదివిస్తున్నారట! మంత్రం చదివితేనే హిందువు అవుతాడా? మహమ్మదీయులకీ మంత్రాలున్నాయి. పిచ్చి కు(ము)దిరింది రోకలి తలకి చుట్టండన్నట్టు ఇదేం పద్ధతి? అసలు హిందూ దేశంలోని క్రైస్తవులు గానీ,మహమ్మదీయులుగానీ ఒక్క సారి మనం పరికించి చూస్తే-వారి ఆచార వ్యవహారాలన్నీ హైందవానికి సంబంధించినవేగా గోచరిస్తాయి.వారూ జాతకాలు చూపించుకోవటం -పెళ్లి ముహూర్తాలు పెట్టించుకోవటం -వాస్తు ప్రశ్నలు అడిగి వాస్తుని పాటించటం చేస్తునే వున్నారు. వాళ్ళు గౌన్లు వేసుకుని తిరగటల్లా-చీరల్లోనే నిండుగా తిరుగుతున్నారు.హిందువుల్లాగే నగ-నట్రా పెట్టుకుంటున్నారు. హైందవం నీ ఆచార వ్యవహారాల్లో వుందా? లేక అర్థం తెలీకుండా చదివే మంత్రాల్లో వుందా? అది తెలుసుకుని అందరూ కలిసి కట్టుగా క్రైస్తవ సోదరులపై అన్యాయంగా దాడి చేసే వారిని అడ్డుకోవాలి. కఠినంగా శిక్షించాలి.చదువుకున్న వారు పూనుకుని మత మౌఢ్యాన్ని ఎండ గట్టాలి!
-
« బుడిగి గాడి డిస్కవరీ -Story-9. | thanks-to-one-and-all-i-too-reciprocate-my-warm-5258875 »
ఉన్మాదానికి పరాకాష్ఠ!!వ్యాసం-1.
@ 2008-09-26 – 07:05:17
0 Trackbacks to ఉన్మాదానికి పరాకాష్ఠ!!వ్యాసం-1.
Related posts
-
తలవంపులు అనే సిగ్గు కథ!
on 2009-11-08 – 13:48:27 -
రాంరళీయం-సందేహాలూ-సమాధానాలు-2.
on 2009-07-29 – 12:09:06 -
రాంరళీయం! సందేహాలూ-సమాధానాలు-1.
on 2009-07-29 – 11:49:31 -
దిష్టి!! story-
on 2009-06-17 – 12:44:40 -
రాంరళీయ షడ్వేదం చతుర్థ దివస పంచ ప్రసూనములు!
on 2009-04-19 – 11:44:40 -
రాంరళీయ షడ్వేదం- తృతీయ దివస పంచ ప్రసూనములు
on 2009-04-18 – 07:50:54 -
రాంరళీయం-ద్వితీయ పంచ ప్రసూనములు.
on 2009-04-17 – 12:28:47 -
రాంరళీయం
on 2009-04-16 – 11:41:04 -
శ్రీ రాంరళీయ షడ్వేదం!! IV
on 2009-04-15 – 13:58:20 -
రాంరళీయం-V
on 2009-04-15 – 13:41:00